Prawn Masala Curry: సీఫుడ్ లవర్స్ కోసం.. ఆంధ్ర స్టైల్‌లో అమ్మమ్మకాలం నాటి రొయ్యల మసాల కూర తయారీ
Prawn Masala Curry recipe: చేపలు, పీతలు రొయ్యలు ఇలా ఎన్నిరకాల సీఫుడ్స్ ఉన్నా రొయ్యల స్థానం వెరీ వెరీ స్పెషల్. నాన్ వెజ్ ప్రియుల్లో సీఫుడ్ లవర్స్ డిఫరెంట్...
Prawn Masala Curry recipe: చేపలు, పీతలు రొయ్యలు ఇలా ఎన్నిరకాల సీఫుడ్స్ ఉన్నా రొయ్యల స్థానం వెరీ వెరీ స్పెషల్. నాన్ వెజ్ ప్రియుల్లో సీఫుడ్ లవర్స్ డిఫరెంట్… రొయ్యలతో అనేక రకాల వంటలను తయారు చేయవచ్చు. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులకు ఈ రొయ్యలతో ప్రత్యేక అనుబంధం ఉంది. రోజు ఏదొక కూరలో రొయ్యలను కలిసి కూరతయారు చేస్తారు. అంతేకాదు ఈ రొయ్యల స్పెషాలిటీ ఏమిటంటే.. రొయ్యలను విడిగా కూరగా వండుకోవచ్చు.. లేదా గుడ్లు, బీరకాయ, పాలకూర, తోటకూర, టమాటా ఇలా ఇతర వాటిల్లో కూడా కలిపి వండుకోవచ్చు. రొయ్యల బిర్యానీ ఇలా అనేక రకాల వంటలను తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఆంధ్ర స్టైల్ లో అమ్మమ్మకాలం నాటి రొయ్యల జీడిపప్పు మసాలా కూర తయారీ తెలుసుకుందాం..
తయారీకి కావాల్సిన పదార్ధాలు:
రొయ్యలు: 1/2 కేజీ ఉల్లిపాయలు (చిన్న చిన్నముక్కలుగా తరిగినవి రెండు కప్పులు) పచ్చిమిర్చి: ఆరు అల్లం వెల్లులి పేస్ట్ ఒక స్పూన్ దాల్చినచెక్క: కొద్దిగా లవంగాలు -5 కారం సరిపడా పసుపు చిటికెడు యాలకులు -3 గరంమసాలా: రెండు స్పూన్లు గసగసాలు – రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి- అరకప్పు కొత్తిమీర తరుగు: చిన్న కప్ కరివేపాకు: రెండు రెమ్మలు జీడిపప్పు: 50 గ్రాములు
తయారీ విధానం: ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గసగసాలు, పచ్చి కొబ్బరి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు తీసుకుని వీటన్నిటిని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేయాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి.. కొంచెం నూనె వేసి.. రొయ్యలను వేడి కొంచెం పసుపు వేసి ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి.. 4 టేబుల్ స్పూన్ల నూనెవేసి .. వేడి ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి. ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. తర్వాత అందులో ముందుగా ఉడికించిన రొయ్యలను వేసుకుని కొంచెం సేపు దోరగా వేయించి జీడిపప్పు వేసుకోవాలి.. కొంచెం సేపు వేయించుకున్నాక కారం వేసి.. ఒక్కసారి మెదిపి.. సరిపడా నీరు పోసి.. స్విమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా గరం మసాలా కరివేపాకు, కొత్తిమీద వేసుకుని ఒక్కసారి కలిపి.. నీరు లేకుండా దగ్గరకు వచ్చే వరకూ కూరని ఉడికించుకోవాలి. అంతే ఘుమఘుమలాడే ఆంధ్ర రొయ్యల మసాలా కూర రెడీ.. అన్నంలోకి చపాతీలోకీ చాలా బాగుంటుంది.
రొయ్యలు మంచి పౌష్టికాహారం.. అంతేకాదు రొయ్యలు బరువు తగ్గడానికి మంచి సహకారిగా ఉపయోగపడతాయి. డైట్ చేసే వారు రొయ్యలను తమ ఆహారంలో చేర్చుకోమని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
Also Read: American Hospital: ఆస్పత్రిలో ఏడ్చిన యువతి.. సర్జరీ బిల్లుతో పాటు ‘ఎమోషనల్ బిల్లు’ వేసిన సిబ్బంది..