AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya Side Effects: ఈ వ్యక్తులు బొప్పాయిని అస్సలు తినకూడదు.. తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకోండి..

బొప్పాయి అటే ఇష్టముండని వారుండరు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. అనేక సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళలకు

Papaya Side Effects: ఈ వ్యక్తులు బొప్పాయిని అస్సలు తినకూడదు.. తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకోండి..
Papaya
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 30, 2021 | 10:09 AM

బొప్పాయి అటే ఇష్టముండని వారుండరు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. అనేక సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళలకు బొప్పాయి చాలా ప్రయోజనకరం. రక్తహీనతతో బాధపడుతున్నవారికి బొప్పాయి తింటే అనేక ప్రయోజనాలుంటాయి. అలాగే చర్మ సమస్యలను తగ్గిస్తుంది. బొప్పాయి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. అందుకే బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం బొప్పాయిని ఉపయోగిస్తుంటారు. బొప్పాయిని తరచూ తీసుకోవడం వలన రక్త హీనత సమస్యను తొందరంగా జయించవచ్చు. అయితే ఏదైనా శ్రుతి మించితే ప్రమాదమంటారు. బొప్పాయి కూడా అంతే.. శ్రుతిమించి తీసుకుంటే.. ఆరోగ్యానికి హానీ కలిగిస్తుంది. బొప్పాయిని విడిగానే కాకుండా.. ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడం కూడా ప్రమాదమే.. అంతేకాకుండా.. కొందరు ఈ వ్యక్తులు బొప్పాయి పండును అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే అంతే సంగతులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. మరి ఏలాంటి వ్యక్తులు బొప్పాయి పండును తినకూడదో తెలుసుకుందామా.

1. గర్భిణీ స్త్రీలు బొప్పాయిని పచ్చిగా లేదా ఉడికించి తీసుకోవద్దు. బొప్పాయి వేడి చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ పండును గర్భిణీ స్త్రీలు తినడం వలన గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయి. 2. కామెర్ల సమస్యతో బాధపడేవారు బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇందులో పాపైన్, బీటా కెరోటిన్ అనే ఎలిమెంట్స్ కామెర్ల సమస్యను మరింత పెంచుతాయి. అందుకే వీరు బొప్పాయిని అస్సలు తినకూడదు. 3. అలాగే సాధారణం కంటే రక్తం ఎక్కువ ఉన్నవారు కూడా బొప్పాయిని తినవద్దు. కొందరిలో రక్తం ఎక్కువగా ఉంటుంది. సాధారణ స్థితికి చేరుకోవడానికి మందులు ఉపయోగిస్తుంటారు. ఆ సమయంలో వీరు బొప్పాయి అస్సలు తినకూడదు. 4. శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడానికి కూడా బొప్పాయి పనిచేస్తుంది. రక్తంలో చెక్కర స్థాయిని తగ్గించడానికి మందులు ఉపయోగిస్తున్న వారు బొప్పాయిని తీసుకోవద్దు. 5. ఏదైనా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారు బొప్పాయిని తీసుకోవద్దు. దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన గుండె వేగం తగ్గే అవకాశం ఉంది. గుండె సంబంధిత సమస్యలున్నవారు బొప్పాయి తీసుకునే ముందు డాక్టర్ సలహాలు తీసుకోవాలి.

Also Read: Nani: నాని డేరింగ్ డెసిషన్.. ఆ స్టార్ హీరో సినిమాలో మరోసారి నెగిటివ్ షెడ్‏లో న్యాచురల్ స్టార్..

Maa Elections 2021: ప్రచారంలోనూ పోటా పోటీ.. ప్రకాష్ రాజ్ ట్వీట్‏కు బండ్ల గణేష్

Mohan Babu: ఆరు నెలలు పనిచేయించుకుని 50 రూపాయాలు జీతం ఇచ్చారు.. మోహన్ బాబు ఆసక్తికర విషయాలు..