Kathi Roll Viral Video: 30 కోడిగుడ్లతో భారీ రోల్.. 20 నిమిషాల్లో తింటే రూ.20 వేలు బహుమతి.. ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా?
Kathi Roll Viral Video: చిన్నదైనా పెద్దదైనా వ్యాపారం అభివృద్ధి చెందాలంటే.. ప్రజలను ఆకర్షించాల్సిందే.. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకున్న వ్యాపారం... మంచి లాభాలను..
Kathi Roll Viral Video: చిన్నదైనా పెద్దదైనా వ్యాపారం అభివృద్ధి చెందాలంటే.. ప్రజలను ఆకర్షించాల్సిందే.. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకున్న వ్యాపారం… మంచి లాభాలను సంపాదిస్తుంది. అందుకనే బడాబడా కంపెనీలు తమ స్టేజ్ కు తగిన విధంగా యాడ్స్ ను తయారు చేయించి తమ ప్రోడక్ట్స్ ను మార్కెట్ చేసుకుంటారు. మరి అదే చిన్న చిన్న వ్యాపార సంస్థలు అయితే జనాన్ని ఆకర్షించాలంటే.. భారీ ప్రకటనలు వేయించలేరు. ఈ నేపథ్యంలో తమ తెలివితేటలకు పదును పెట్టి.. తమదైన శైలి కస్టమర్స్ ను ఆకర్షితున్నారు. తాజాగా ఓ రోడ్ సేడ్ ఫుడ్ స్టాల్ సరికొత్త పోటీని తెరమీదకు తీసుకొచ్చింది. 10కేజీల బరువున్న ఈ కఠీ రోల్‌ని తినండి.. రూ 20 వేలు గెలుచుకోండి అంటూ తిండి పుష్టిగలవారికి సవాల్ విసిరింది. వివరాల్లోకి వెళ్తే.
దేశ రాజధాని ఢిల్లీలో మోడల్ త్రీ టౌన్ లో ఓ రోడ్డు సైడ్ పుడ్ స్టాల్ భారీ కాఠీ రోల్‌ని తయారు చేసింది. ఈ రోల్ ను 30 గుడ్లతో తయారు చేశారు. ఈ భారీ కాఠీ రోల్‌ను 20 నిమిషాల్లో తిన్నవారికి బహుమతిగా రూ. 20 వేల రూపాయలను షాప్ యాజమాన్యం ప్రకటించింది. ఈ రోల్ ను కూరగాయలు, గుడ్లు, నూడుల్స్ తో తయారు చేశారు. తినడానికి సాస్ ను కూడా ఇస్తున్నారు. ఫుడ్ వ్లాగింగ్ పేజీ ది ఫుడ్ కల్ట్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ అతి పెద్దదైన రోల్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తమకు రోల్ ని తినాలని ఉందనే కోరికను వ్యక్తం చేశారు. మరికొందరు ఈ రోల్ తిన్న తర్వాత నెక్స్ట్ డే అజీర్తితో ఆసపత్రికి చేరాల్సి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు, లక్షల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ కాఠీ రోల్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి… తినాలని.. బహుమతి కోసం ట్రై చేయాలనీ పిస్తే ఢిల్లీ వెళ్లాల్సిందే మరి.
View this post on Instagram
Also Read: Brain Eating Amoeba: అగ్రరాజ్యంలో మళ్ళీ మెదడు తినే అమీబా వెలుగులోకి.. చికిత్స పొందుతూ మృతి..