Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్స్.. ఐశ్వర్య రాజేశ్ కంటే ముందు…
ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతి పండక్కి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు వెంకటేశ్. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతుంది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమాకు ఫ్యామిలీ అడియన్స్ జై కొడుతున్నారు. ఫస్ట్ డే ఈ సినిమా దాదాపు రూ.45 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో వెంకీ, ఐశ్వర్య, మీనాక్షి యాక్టింగ్.. ఒకప్పటి వింటేజ్ వెంకీ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అలాగే ఈ సినిమాలో బుల్లిరాజు పాత్ర హైలెట్ అయ్యింది. ఇక ఈ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేశ్.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ పెళ్లాం పాత్రలో యాక్టింగ్ అదరగొట్టేసింది ఐశ్వర్య. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన పాత్ర గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నిజానికి ఆ పాత్ర నా దగ్గరికి వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ముందే నాతో చెప్పారు. నలుగురి పిల్లల తల్లి పాత్ర కావడంతోనే వాళ్లు రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. అది పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకడం నా భాగ్యం. ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్లు బాధపడతారు” అంటూ చెప్పుకొచ్చింది.
అయితే భాగ్యం పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండు రోజుల్లో రూ.77 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..