Manchu Manoj: మంచు ఫ్యామిలీలో ఆగని మంటలు.. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు మనోజ్

మంచు ఫ్యామిలీలో మంట ఇంకా అలాగే రగులుతూనే ఉంది. ఆ ఫ్యామిలీ గొడవలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంచు మనోజ్ దంపతులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో శ్రీ విద్యానికేతన్ దగ్గర జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు.

Manchu Manoj: మంచు ఫ్యామిలీలో ఆగని మంటలు.. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు మనోజ్
Mohan Babu , Manchu Manoj
Follow us
Basha Shek

|

Updated on: Jan 16, 2025 | 12:34 PM

మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పట్లో ఆగేలా లేవు. మోహన్ బాబు, విష్ణు వర్సెస్ మనోజ్ ల మధ్య వార్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా ఈ గొడవలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బుధవారం (జనవరి 17) మోహన్‌బాబు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు మంచు మనోజ్ దంపతులు. అయితే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం లోనికి పంపించేందుకు నిరాకరించారు. అదే సమయంలో కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా తాము కూడా అనుమతించలేమన్నారు పోలీసులు. గేటు తీయాలంటూ చాలాసేపు వర్సిటీ ఎదుటే నిరీక్షించారు మనోజ్ దంపతులు. అప్పటికే చాలామంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఉద్రిక్త పరిస్థితి మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు మనోజ్‌. యూనివర్సిటీకి వస్తున్నానని తెలిసి కొంతమంది బౌన్సర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. వాళ్లకు భయపడే పరిస్థితి లేదన్నారు. కేవలం పోలీసుల మాట విని మాత్రమే వెళ్లిపోతున్నానని అన్నారు మనోజ్‌. అయితే తాజాగా చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మనోజ్ ఫ్యామిలీ శ్రీ విద్యానికేతన్ దగ్గర జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. తమను కాలేజీలోకి అనుమతించకుండా అడ్డుకున్న తీరును ఫిర్యాదులో వివరించారు. మరి దీనిపై పోలీసులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.