AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: నాకు నా కూతురు కన్నా ఎవరూ ముఖ్యం కాదు.. ఎమోషనల్ అయిన ఐశ్వర్య రాయ్

కూతురు ఆరాధ్య బచ్చన్‌ను చూసుకునే పనిలో బిజీగా ఉంది ఐష్. అభిషేక్, ఐశ్వర్యలకు ఆరాధ్య 2011లో జన్మించింది. అప్పటి నుంచి ఆరాధ్య వార్తల్లో నిలుస్తోంది. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆరాధ్య ను వెంట తీసుకెళ్తుంది. ఆరాధ్య పుట్టిన తర్వాత జీవితం మారిపోయిందని ఐశ్వర్యరాయ్ పలు సందర్భాల్లో పేర్కొంది.

Aishwarya Rai: నాకు నా కూతురు కన్నా ఎవరూ ముఖ్యం కాదు.. ఎమోషనల్ అయిన ఐశ్వర్య రాయ్
Aishwarya Rai
Rajeev Rayala
|

Updated on: Sep 11, 2024 | 12:09 PM

Share

ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇప్పుడు తల్లిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. కూతురు ఆరాధ్య బచ్చన్‌ను చూసుకునే పనిలో బిజీగా ఉంది ఐష్. అభిషేక్, ఐశ్వర్యలకు ఆరాధ్య 2011లో జన్మించింది. అప్పటి నుంచి ఆరాధ్య వార్తల్లో నిలుస్తోంది. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆరాధ్య ను వెంట తీసుకెళ్తుంది. ఆరాధ్య పుట్టిన తర్వాత జీవితం మారిపోయిందని ఐశ్వర్యరాయ్ పలు సందర్భాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఐశ్వర్య, అభిషేక్‌ల విడాకుల వార్త ఈ మధ్య చర్చనీయాంశమైంది. అభిషేక్‌కి ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారని జోరుగా ప్రచారం జరిగుతోంది. దీని పై ఇంతవరకు దీని పై ఐష్ కానీ అభిషేక్ కానీ స్పందించలేదు.

ఇది కూడా చదవండి : Mahesh Babu: స్టార్ హీరోయిన్స్‌ కూడా కుళ్ళుకుంటారు.. మహేష్ బాబు అన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

కాగా, ఐశ్వర్య పాత ఇంటర్వ్యూ  ఇప్పుడు వైరల్‌గా మారింది. ’18 ఏళ్ల వయసులో చాలా బాధ్యతలు మోశాను. నేను ఉదయం 5:30 గంటలకు లేచేదాన్ని. నేను ఇప్పటికీ ఆ రోజులను గుర్తుంచుకుంటాను. కానీ, ఆరాధ్య పుట్టిన తర్వాత నా ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. ఆమె నాకు ముఖ్యం.. ఆమె తర్వాతే ఎవరైనా ‘ అని తెలిపింది ఐష్. ‘ఆరాధ్య ఎప్పుడూ పాటలు పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి నా సినిమా పాట, ఒక్కోసారి తన నాన్న పాట, ఇంకొన్ని సార్లు తాతయ్య సినిమా పాటలు పాడుతుంది. ఆరాధ్య సాధారణ జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంది’ అని ఐశ్వర్య తెలిపారు. అంతేకాదు కూతురు కన్నా మరెవరూ ముఖ్యం కాదని చెప్పింది ఐష్.

ఇది కూడా చదవండి : సినిమాలో పద్దతిగా.. బయట మాత్రం బాబోయ్ బీభత్సం..! ఈ అమ్మడు గుర్తుందా..?

ఆరాధ్యకు ఏది అవసరమో, అది నేనే చేయాలని భావిస్తున్నాను. కానీ, బిజీ షెడ్యూల్‌తో అలా చేయలేకపోతున్నాను. అయితే నాకు సపోర్ట్ గా నిలిచే భర్త ఉన్నాడు. అందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. ఆరాధ్య నాకు ముఖ్యం, ఆమె కంటే మరెవరూ ముఖ్యం కాదు’ అని ఐశ్వర్య మరీ మరి తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐశ్వర్య ఆమె కూతురు ఇద్దరూ బచ్చన్ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అనంత్ అంబానీ పెళ్లికి వీరిద్దరూ కలిసి వచ్చారు.

ఇది కూడా చదవండి :Bigg Boss 8 Telugu: ఈ వైల్డ్ కార్ట్ ఎంట్రీ యమా హాట్ గురూ..! హౌస్‌లో మరో అందాల భామ.. ఇక రచ్చ రచ్చే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us