Fahadh Faasil: మరో స్టార్ హీరో సినిమాలో ఫహద్ ఫాజిల్.. విలన్‌గానా..? లేక

ఇటీవలే ఆయన నటించిన 'ఆవేశం' సినిమా విడుదలైంది, ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రంగా పాత్రలో నటించాడు ఫహద్‌ ఫాజిల్‌. అతని నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంతో పాటు అక్షయ్ కుమార్ 'బడే మియాన్ ఛోటే మియాన్' అలాగే అజయ్ దేవగన్ 'మైదాన్' కూడా వచ్చినప్పటికీ, రెండు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. త్వరలో ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఆవేశం.

Fahadh Faasil: మరో స్టార్ హీరో సినిమాలో ఫహద్ ఫాజిల్.. విలన్‌గానా..? లేక
Fahadh Faasil
Follow us

|

Updated on: Jun 16, 2024 | 12:16 PM

మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌ గా రాణిస్తున్నాడు ఫహద్‌ ఫాజిల్‌. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ గాను నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన నటించిన ‘ఆవేశం’ సినిమా విడుదలైంది, ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రంగా పాత్రలో నటించాడు ఫహద్‌ ఫాజిల్‌. అతని నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంతో పాటు అక్షయ్ కుమార్ ‘బడే మియాన్ ఛోటే మియాన్’ అలాగే అజయ్ దేవగన్ ‘మైదాన్’ కూడా వచ్చినప్పటికీ, రెండు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. త్వరలో ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఆవేశం. అలాగే ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు

అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’లో ఫహద్ ఫాజిల్ విలన్‌గా  చేస్తాడు.  మరోసారి రెండో భాగంలో పుష్పరాజ్‌తో తలపడనున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా పుష్ప 2 వాయిదా పడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం ‘అవేశం’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఫహద్ ఫాజిల్ నటుడిగానే కాకుండా నిర్మాత కూడా.. ఆయన ‘ప్రేమలు’ నిర్మించారు. ఈ చిత్రం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఫహద్‌ ఫాజిల్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో చేయనున్నాడని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ఫహద్ ఫాజిల్ మరోసారి అసోసియేట్ కాబోతున్నాడట. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా- కూలీ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే దీని టైటిల్‌ను ప్రకటించారు. దీనితో పాటు, రజనీకాంత్ పూర్తి యాక్షన్ మోడ్‌లో కనిపించిన వీడియోను కూడా విడుదల చేశారు. ఫహద్ ఫాజిల్, లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ‘విక్రమ్’ సినిమాలో కలిసి పనిచేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు రజినీకాంత్ సినిమాలోనూ ఫహద్‌ ఫాజిల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తాడని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles