AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varsha Bollamma: పెళ్లి పుకార్లపై స్పందించిన యంగ్‌ హీరోయిన్‌.. వారు స్వాతిముత్యం సినిమా చూడాలంటూ సెటైర్లు

ఇప్పటికే తన పెళ్లిపై పుకార్లు ప్రచారం చేసిన వారిపై అనన్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా వర్ష కూడా తన పెళ్లి వార్తలపై స్పందించింది. తన పెళ్లి గురించి పలు వెబ్‌సైట్స్‌లో వచ్చిన కథనాలను స్క్రీన్‌ షాట్స్‌ తీసి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన ఆమె..

Varsha Bollamma: పెళ్లి పుకార్లపై స్పందించిన యంగ్‌ హీరోయిన్‌.. వారు స్వాతిముత్యం సినిమా చూడాలంటూ సెటైర్లు
Varsha Bollamma
Basha Shek
|

Updated on: Oct 29, 2022 | 7:33 AM

Share

నిన్న అనన్య నాగళ్ల.. నేడు వర్ష బొల్లమ్మ.. బడా నిర్మాత కుమారులతో ఈ  టాలీవుడ్ యంగ్‌ హీరోయిన్లు పెళ్లిపీటలెక్కుతున్నారంటూ వార్తలు తెగ హల్‌చల్‌ చేశాయి. ఇక సోషల్‌ మీడియా అయితే వీరి పెళ్లి వార్తలతో హోరెత్తిపోయింది. ఇప్పటికే తన పెళ్లిపై పుకార్లు ప్రచారం చేసిన వారిపై అనన్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా వర్ష కూడా తన పెళ్లి వార్తలపై స్పందించింది. తన పెళ్లి గురించి పలు వెబ్‌సైట్స్‌లో వచ్చిన కథనాలను స్క్రీన్‌ షాట్స్‌ తీసి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన ఆమె .. ‘నాకోసం నాకే తెలియకుండా పెళ్లిచూపులు చేసి ఒక అబ్బాయిని సెలక్ట్‌ చేసినందుకు థ్యాంక్‌ యూ. ఆ అబ్బాయి ఎవరో చెప్తే నేను కూడా మా ఇంట్లో వాళ్లకి చెప్పేస్తా. ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు చూడాలంటే ఆహాలో స్వాతిముత్యం సినిమా చూడండి’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ పోస్టుకు #FAKENEWS అన్న హ్యాష్‌ ట్యాగ్‌ జోడించింది. మొత్తానికి ఒక్క ట్వీట్‌తో తన పెళ్లి వార్తలకు చెక్‌ పెట్టేసింది వర్ష. మరీ అంతగా తన పెళ్లిచూపులు చూడాలనుకుంటే తన లేటెస్ట్‌ సినిమా స్వాతిముత్యం సినిమాను కూడా పనిలో పనిగా ప్రమోట్‌ చేసుకుంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వర్ష ట్వీట్‌ చూసిన నెటిజన్లు ‘ నేను నిర్మాత కుమారుడిని కాదు, డబ్బులేదు కానీ… మంచి మనసు ఉంది’, ‘నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా’ అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు.

కాగా చూసీ చూడంగానే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది వర్ష. అంతకుముందు కొన్ని తమిళ్‌, మళయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక జాను, మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌, పుష్పకవిమానం, స్టాండప్‌ రాహుల్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇటీవల బెల్లంకొండ గణేశ్‌తో కలిసి ఆమె నటించిన స్వాతిముత్యం దసరా కానుకగా విడుదలై డీసెంట్ హిట్‌గా నిలిచింది. స్వాతిముత్యం సక్సెస్‌ను ఆస్వాదిస్తోన్న సమయంలో వర్ష పెళ్లిపై పుకార్లు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. వర్ష అందం, అభినయానికి ఓ సీనియర్‌ నిర్మాత కొడుకు ఫిదా అయ్యాడని, ఆమెను కోడలిగా చేసుకునేందుకు సదరు నిర్మాత కూడా ఒకే చెప్పాడన్న వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఇరు కుటుంబాలు కూడా చర్చించుకుని పెళ్లికి ఒకే చెప్పుకున్నారని కొన్ని వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి