Varsha Bollamma: పెళ్లి.. ప్రెగ్నెన్సీ పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. అలా కనిపిస్తే అనేస్తారా అంటూ ఫైర్..
చూసీ చూడంగానే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). ఆ సినిమా పేరుకు తగ్గట్టుగానే చూడగానే ఆకట్టుకునే రూపం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది.
చూసీ చూడంగానే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). ఆ సినిమా పేరుకు తగ్గట్టుగానే చూడగానే ఆకట్టుకునే రూపం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత జాను లాంటి కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో మెరుపులు మెరిపించి అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో సినీ ప్రియులకు మరింత చేరువైంది. ఆ సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన వర్ష నటనకు అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో అవకాశాలు దక్కించుకంటూ బిజీగా ఉంటోందీ అందాల తార. ఇదిలా ఉంటే రాజ్‌తరుణ్‌తో ఆమె కలిసి నటించిన స్టాండప్ రాహుల్ మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హీరో, హీరోయిన్లు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
పెళ్లి అయ్యింది కానీ.. కాగా ఇటీవల ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ తరుణ్ వర్షను సరదాగా ఆటపట్టించాడు. ఈ మధ్య కాలంలో ఆమె గురించి ఎక్కువగా వార్తల్లో నిలిచిన, గూగుల్ సెర్చ్ చేసిన అంశాలపై వర్షను ప్రశ్నించాడు. కాగా రాజ్ తరుణ్ అడిగిన అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చిన వర్ష తన పెళ్లి, ప్రెగ్నెంట్ వార్తలపై మాత్రం కొంచెం అసహనం వ్యక్తం చేసింది. ‘నాకు పెళ్లైతే ఏంటీ? కాకపోతే ఏంటీ?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ‘ఆ తర్వాత పెళ్లి అయ్యింది కానీ నిజంగా కాదు.. సినిమాల్లో’ అంటూ చమత్కరించింది. ‘ నా బుగ్గల వల్లే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. చీక్స్ కాస్తా లావుగా ఉంటే పెళ్లైంది, ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అవుతారా? నేను 1996లో పుట్టాను. ప్రస్తుతం నా వయసు 25 మాత్రమే’ అని చెప్పుకొచ్చింది వర్ష. కాగా స్టాండప్ రాహుల్ తర్వాత సెల్ఫీ (తమిళం) చిత్రంలో నటిస్తోందీ ముద్దుగుమ్మ. అలాగే స్వాతిముత్యం పేరుతో తెరకెక్కుతోన్న మరో సినిమాకు సైన్ చేసింది.
Also Read:LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్ రూ. 634కే అందిస్తున్న ఆ కంపెనీ..!
AP Crime News: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్ను.. ఇద్దరు స్నేహితులతో కలిసి..
JEE Main 2022 Rescheduled: జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు