JEE Main 2022 Rescheduled: జేఈఈ మెయిన్ సెషన్‌-1 పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు

JEE Main 2022 Rescheduled: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (NTA) జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (JEE) మెయిన్‌ 2022 సెషన్‌ -1 పరీక్ష షెడ్యూల్‌లలో మార్పులు జరిగాయి. ఈ జేఈఈ మెయిన్‌ (JEE Main 2022..

JEE Main 2022 Rescheduled: జేఈఈ మెయిన్ సెషన్‌-1 పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 14, 2022 | 1:02 PM

JEE Main 2022 Rescheduled: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (NTA) జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (JEE) మెయిన్‌ 2022 సెషన్‌ -1 పరీక్ష షెడ్యూల్‌లలో మార్పులు జరిగాయి. ఈ జేఈఈ మెయిన్‌ (JEE Main 2022) సెషన్‌ -1 పరీక్షలు మొదటి దశ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి జరగాల్సిన పరీక్షలు ఏప్రిల్‌ 21 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఏప్రిల్‌ 21, 24, 25, 29, మే 1, 4వ తేదీల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. బోర్డు పరీక్షలు, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా సీబీఎస్‌ఈ (CBSE) టర్మ్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌ 26న ప్రారంభం కానున్నాయి.

ఈ గొడవల కారణంగా నేషనల్‌ టెస్టింగ్‌ సూచనల మేరకు ఏజన్సీ జేఈఈ మెయిన్‌ 2022 సెషనల్‌1 పరీక్ష షెడ్యూల్‌ తేదీలను మార్చడం జరిగిందని ఎన్‌టీఏ అధికారిక నోటీసులో పేర్కొంది. జేఈఈ మెయిన్‌ 2022 కోసం దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మార్చి 31వ తేదీ వరకు jeemain.nta.nic.inలో ఇంజనీరింగ్‌ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని జాగ్రత్తగా పూరించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ ఫారమ్‌లో ఎటువంటి సవరణలు ఉండవు.

Jee

ఇవి కూడా చదవండి:

Telangana Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలోనే ఆ శాఖ నుంచి మొదటి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే..

ESIC Recruitment 2022: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో జాబ్ నోటిఫికేషన్.. అర్హతలు ఉంటే నెలకు రూ.1.42 లక్షల జీతం..

CBSE: పదో తరగతి విద్యార్థులకి షాక్.. అవి రిజల్ట్‌ కాదు.. థియరీ మార్కులు మాత్రమే..