Varalakshmi Sharathkumar: యశోద సెట్స్ నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన జయమ్మ.. ఎమోషనల్ పోస్ట్ చేసిన వరలక్ష్మీ..
సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న యశోద సినిమా ఒకటి.. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తోంది..
వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar).. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. గతేడాది మాస్ మహారాజా రవితేజ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టింది వరలక్ష్మీ.. ఇందులో పూర్తిగా నెగిటివ్ పాత్రలో కనిపించి మెప్పించింది.. ఈ సినిమాతో వరలక్ష్మీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.. ఇందులో ముఖ్యంగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న యశోద సినిమా ఒకటి.. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తోంది..
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశ ఉంది.. ఇందులో వరలక్ష్మీ పాత్రలో మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుందని.. మూవీలో ఆమె పాత్ర హైలేట్ కానుందని సమాచారం.. తాజాగా ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైంది.. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్టింట ఎమోషనల్ పోస్ట్ చేస్తూ.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. యశోద టీంకు చాలా థ్యాంక్స్.. నా షూటింగ్ పూర్తైంది.. మీ అందరితో పనిచేయడం చాలా సంతోషం.. ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చినందుకు యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు.. ఈ మూవీని వెండితెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. అలాగ చిత్రయూనిట్ సభ్యులతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.