Trisha: ఆ ప్రముఖ ఆలయంలో త్రిష ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. కారణమదేనా?

సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఆమెది దాదాపు 22 ఏళ్ల ప్రస్థానం. అయినా ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ అగ్రతారగా వెలుగొందుతోందీ అందాల తార. తాజాగా త్రిషకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.

Trisha: ఆ ప్రముఖ ఆలయంలో త్రిష ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. కారణమదేనా?
Trisha
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2024 | 7:58 PM

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో త్రిష ఒకరు. సుమారు 22 ఏళ్లుగా సినిమాలు చేస్తోందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఆ మధ్యన కొంచెం స్పీడ్ తగ్గినా ఇప్పుడు మళ్లీ జెట్ స్పీడ్ లో మూవీస్ చేస్తోందీ ముద్దుగుమ్మ. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంట్ మూవీస్ లోనూ మెరుస్తోంది. అలాగే వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేస్తోంది. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటుంది త్రిష. ముఖ్యంగా 41 ఏళ్ల త్రిష ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుంది. దీంతో తరచూ ఆమె గురించి ప్రేమ, డేటింగ్, రిలేషన్ షిప్ రూమర్లు వినిపిస్తుంటాయి. ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరోతో త్రిషను ముడిపెడుతూ నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ విషయాలను అసలు పట్టించుకోవడం లేదీ అందాల తార. ఈ నేపథ్యంలో సినిమా షూటింగులతో నిత్యం బిజీ బిజీగా ఉండే త్రిష కోయంబత్తూరులోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్‌(కుమారస్వామి) ఆలయానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

మురుగన్ ఆలయానికి వెళ్లిన త్రిష అక్కడ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆమెను గమనించిన భక్తులు ఒక్కసారిగా గూమి గూడారు. ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో అందరితో ఫొటోలు దిగిన త్రిష అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. ఉన్నట్లుండి త్రిష దైవ దర్శనం చేసుకోవడంపై కూడా సినీ అభిమానులు, నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మురుగన్ ఆలయంలో త్రిష పూజలు.. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by NTC Talks (@ntctalks)

సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి .అందులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఒకటి. అలాగే ఇటీవల సూర్య 45వ సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికైందీ అందాల తార.

మెగాస్టార్ చిరంజీవి, కీరవాణిలతో త్రిష..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

విశ్వంభర సెట్ లో బ్యూటీ క్వీన్..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!