Tejaswi Madivada: అబ్బాయిలు బాడీ చూపిస్తే సూపర్ అంటున్నారు.. అదే నేను బికినీ వేసుకుంటే ఇలా అంటారు..

హీరోయిన్ గా కొన్ని సినిమాలు అలాగే సెకండ్ హీరోయిన్ గా మరికొన్ని సినిమాలు చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. హీరోయిన్స్ ను బీట్ చేసే అందాలు ఉన్న ఈ అమ్మడు ఎందుకో అంతగా క్లిక్ అవ్వలేదు.

Tejaswi Madivada: అబ్బాయిలు బాడీ చూపిస్తే సూపర్ అంటున్నారు.. అదే నేను బికినీ వేసుకుంటే ఇలా అంటారు..
Tejaswi Madivada
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 21, 2024 | 5:09 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది తేజస్వి మదివాడ. ఆ సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత మనం, నితిన్ హార్ట్ ఎటాక్ సినిమాల్లో కూడా కనిపించింది. ఇక రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు అలాగే సెకండ్ హీరోయిన్ గా మరికొన్ని సినిమాలు చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. హీరోయిన్స్ ను బీట్ చేసే అందాలు ఉన్న ఈ అమ్మడు ఎందుకో అంతగా క్లిక్ అవ్వలేదు. ఓ వైపు సినిమాలతో పాటు ఇప్పుడు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తుంది ఈ భామ.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

తెలుగులో బిగ్ బాస్ గేమ్ షోలో రెండు సీజన్స్ లో పాల్గొంది తేజస్వి. అదేవిధంగా 2024లో రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ షోలో పాల్గొంది. ఇక ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ లో నటించి మెప్పించింది. అంతే కాదు ఈ సిరీస్ లో తేజస్వి మదివాడ బికినీలో మెరిసింది. ఇదిలా ఉంటే బోల్డ్ గా కనిపించడం పై ఓ ఇంటర్వ్యూలో తేజస్వి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇది కూడా చదవండి : నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు. 

తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడు ఎక్స్ పోజ్ చేద్దామనో.. ఎక్స్ పోజింగ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, మంచి రోల్స్ వస్తాయనో.. ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడూ నాకు నచ్చిందే చేశా.. తెలుగు అమ్మాయిని కాబట్టి షార్ట్ వేసుకోవడానికి సిగ్గుపడేదాన్ని.. ఇండియాలో మనం షార్ట్స్ వేసుకొని బయటకు వెళ్తే అంత కంఫర్ట్ బుల్ గా ఉండదు. కానీ మన చుట్టూ ఉండేవాళ్ళు బికినీ వేసుకున్నప్పుడు మనం కూడా కంఫర్ట్ బుల్ గా ఫీల్ అవుతాం… ఐదేళ్ల క్రితం నేను బికినీ వేసుకున్నా.. మాల్దీవ్స్ కు వెళ్ళినప్పుడు వేసుకున్న అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : తస్సాదీయ్యా..! స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.? బడా డైరెక్టర్ భార్య ఆమె..

“అలాగే నాకు అలాంటి బాడీ ఉండటం, నేను బికినిలో అందంగా ఉండటంతో నన్ను నేను యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు నాకు 33 ఏళ్లు.. నా బాడీ నాకు నచ్చుతుంది. నేను ఫిట్ గా ఉన్నాను, అందంగా ఉన్నాను.. అందుకే ఇప్పుడు బికినీ వేసుకోవాలని అనుకున్నా.. ఆతర్వాత వేసుకుంటానో లేదో తెలియదు. ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు.. నా సరదా కోసం బికినీ వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. ఓ షోలో .. ఓ హాట్ సీన్ లో అవసరం కాబట్టి చేశాను. నా పాత బాయ్ ఫ్రెండ్ కు నన్ను నమ్మాడు. ఇప్పుడు ఉన్న బాయ్ ఫ్రెండ్ నన్ను ఓ చిన్న పిల్లలా చూస్తాడు. అతను నన్ను బికినీలో చూసి షాక్ అయ్యాడు. ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిలు బాడీ చూపిస్తున్నారు. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ షర్ట్స్ ఇప్పేస్తున్నారు. అదే నేను చేస్తే మాత్రం.. ఎదో చేసినట్టు ఫీల్ అవుతున్నారు. నేను కూడా జిమ్ కు వెళ్లి బాడీ డవలప్ చేశా.. ఇప్పుడు నేను బికినీలో కంఫర్టుబుల్ గా ఉన్నాను. కానీ ఇప్పటికీ బయటకు వెళ్తే బికీనీ బికినీ అంటున్నారు .. జీవితంలో నేను ఇంత ముందుకు వెళ్ళా.. మీరు ఇంకా బికినీ దగ్గరే ఉన్నారు ఏంట్రా అనిపిస్తుంది అని తేజస్వి మదివాడ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!