Taapsee Pannu: తాప్సీ ఫిట్నెస్ కోసం నెలకు అంత ఖర్చు పెడుతుందా ?.. డైటీషియన్ కోసం లక్షల్లోనే..
తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. తాను ప్రతి నెల డైటీషియన్‌కు లక్షల్లోనే ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు ఎప్పుడూ తనను తిడుతుంటారని.. ప్రస్తుతం తాను ఉన్న వృత్తిలో ఇలాంటి ఖర్చు ఉండాల్సిందేనన్నారు తాప్సీ.
మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై..అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. ఒకానొక సమయంలో తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. గత కొన్ని రోజుల క్రితం తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫోటోగ్రాఫర్లతో చిన్న చిన్న వాగ్వాదాలు జరగడంతో తాప్సీ పేరు నెట్టింట మారుమోగింది. అయితో చాలా కాలంగా మీడియా ముందుకు రావడం లేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. తాను ప్రతి నెల డైటీషియన్‌కు లక్షల్లోనే ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు ఎప్పుడూ తనను తిడుతుంటారని.. ప్రస్తుతం తాను ఉన్న వృత్తిలో ఇలాంటి ఖర్చు ఉండాల్సిందేనన్నారు తాప్సీ.
ది లాలాన్‌టాప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. తన తండ్రి ఎప్పుడూ డబ్బు పొదుపు చేయాలని అంటుంటారని.. జీవితమంతా డబ్బు ఆదా చేసినా.. తన కోసం ఎలాంటి ఖర్చులు చేయరని చెప్పింది. ఇక ప్రతిసారి తనను డైటీషియన్ విషయంలో తన తల్లిదండ్రులు కోప్పడుతుంటారని చెప్పుకొచ్చింది. ప్రతి నెలా డైటీషియన్ ఖర్చు ఎంత అని యాంకర్ ప్రశ్నించగా.. కొన్ని సెకన్లపాటు తడబడిన తాప్సీ.. ఆ తర్వాత నెలకు దాదాపు రూ. లక్ష అని చెప్పింది. దీంతో తాప్సీ ఆన్సర్ విని నెటిజన్స్ షాకవుతున్నారు.
ప్రస్తుతం తాను సినీరంగంలో ఉన్నానని.. తన జీవితంలో ఎక్కడా ఉన్నాను అనేదానిపై తన ఆహారం.. జీవనశైలీ ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రతి నాలుగు లేదా ఐదు సంవత్సరాలకు శరీరంలో మార్పులు వస్తుంటాయని.. అలాగే అనేక నగరాలు, దేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనే విషయంలో నిపుణుల సలహాలు చాలా అవసరమని అన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.