వెండితెరపైకి సుప్రిత ?.. అసలు విషయం చెప్పిన సురేఖ వాణి.. ఇంతకీ మ్యాటరెంటంటే..

తెలుగు సినిమాల్లో గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖా వాణి ఒకరు. అక్కగా, వదినగా, అమ్మగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది

వెండితెరపైకి సుప్రిత ?.. అసలు విషయం చెప్పిన సురేఖ వాణి.. ఇంతకీ మ్యాటరెంటంటే..
Surekha Vani

తెలుగు సినిమాల్లో గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖా వాణి ఒకరు. అక్కగా, వదినగా, అమ్మగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది సురేఖా. తనదైన కామెడీ టైమింగ్‌తో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సురేఖా వాణి యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక సురేఖ వాణి కూతురు సుప్రిత గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుప్రిత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆమె నెట్టింట్లో ఎంతో మంది అభిమానులున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లైవ్ చాట్‏లు పెడుతూ… తన ఫాలోవర్లతో ముచ్చటలను పెడుతూ యాక్టివ్‏గా ఉంటారు. అయితే ఇక ఎప్పుడూ నెట్టింట్లో హల్‏చల్ చేస్తూ.. ఎంతో యాక్టివ్‏గా ఉంటున్న సుప్రిత.. త్వరలోనే సినీ అరంగేట్రం చేయబోతుందని.. హీరోయిన్‏గా రాబోతుందని పలు కథనాలు వెలువడ్డాయి.

అయితే ఇదే విషయంపై సురేఖ వాణి పలు సందర్బాల్లో స్పందించారు. తాజాగా ఆమె మరోసారి సుప్రిత విషయంపై మాట్లాడుతూ.. ప్రస్తుతం సుప్రిత చదుకుంటోంది. తను చదువు పై దృష్టి పెట్టడంతోపాటు డాన్స్‏లు, నటన ట్రైనింగ్ కూడా తీసుకుంటుందని చెప్పుకొచ్చింది. అలాగే తెలుగు డైలాగ్ డెలవరీ సరిగ్గా ఉండేందుకుగాను తెలుగు పండితుడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. సురేఖ వాణి మాటలను బట్టి చూస్తే.. ఇప్పట్లో సుప్రిత వెండితెరపైకి వచ్చే ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది. ఇక సుప్రిత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుండంతో.. ఆమె హీరోయిన్‏గా చేస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: మరోసారి తన నోటికి పని చెప్పిన వనితా విజయ్ కుమార్.. స్టేజ్‏పైనే ఇష్టానుసారంగా మాటలు.. ధీటుగా కౌంటర్ ఇచ్చిన శివగామి..

Vishal: మరోసారి షూటింగ్ సెట్‏లో ప్రమాదం… తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్..

Sri Rama: తెరపైకి సిక్స్‌ ప్యాక్‌ రాముడు, వీఎఫ్‌ఎక్స్‌ రాముడు వస్తున్నాడు.. మరి ఆ ఎన్టీ రాముడిని మైమరిపిస్తాడంటారా.?

రాజమౌళి గురించి తమిళ హీరో ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా.? బాలకృష్ణ వ్యాఖ్యలపై ఫైర్‌ అవుతోన్న రెహమాన్‌ ఫ్యాన్స్‌.