Shradda Kapoor : ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను.. శ్రద్ధా కపూర్..
సాధారణంగా సినీరంగంలోని స్టార్ హీరోలకు ఉండే డిమాండ్ గురించి చెప్పక్కర్లేదు. ఎంతో మంది హీరోయిన్స్.. అగ్ర హీరోలతో జోడి కట్టాలనుకుంటారు. ఎప్పుడెప్పుడు మంచి ఛాన్స్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా మాత్రం ఓ హీరోతో అస్సలు నటించను అంటోంది. అసలేం జరిగిందంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఈ అమ్మడు.. సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలో అందం, ప్రతిభతో కోట్లాది మంది అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రద్ధా… ప్రభాస్ సరసన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ బాలీవుడ్ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. ఇదెలా ఉంటే.. తనకు ఎన్ని కోట్లు సంపాదించినప్పటికీ ఓ హీరోతో అస్సలు నటించను అంటుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
గతంలో శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. తనకు 16 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘లక్కీ నో టైమ్ ఫర్ లవ్’ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపింది. కానీ శ్రద్ధా ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. 2010లో, ఆమె తీన్ పట్టి సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శ్రద్ధా మాట్లాడుతూ, “15-16 సంవత్సరాలు చాలా చిన్నవని నేను అనుకున్నాను. ఆ సమయంలో, నేను స్కూల్ పూర్తి చేసి కాలేజీకి వెళ్లాల్సి వచ్చింది. కానీ సల్మాన్ తో ఆఫర్ తిరస్కరించడం అంత సులభం కాదు కాబట్టి అది చాలా కష్టమైన నిర్ణయం” అని అన్నారు.
శ్రద్ధా మొదటి సినిమా ఫ్లాప్ అయింది, ఆ తర్వాత లవ్ కా ది ఎండ్ కూడా ఫ్లాప్ అయింది. కానీ ఆమె మూడవ సినిమా ఆషికి 2 సూపర్ హిట్ అయింది. శ్రద్ధా నటించిన ‘స్త్రీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందించింది, అది ఆమె కెరీర్ లో ఒక మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆమె అనేక హిట్ చిత్రాలను ఇచ్చింది. శ్రద్ధా చివరిసారిగా గత సంవత్సరం విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం ‘స్త్రీ 2’ లో కనిపించింది. ప్రస్తుతం ఆమె లక్ష్మణ్ ఉత్తేకర్ దర్శకత్వంలో ‘ఈటా‘ సినిమాలో నటిస్తోంది.
View this post on Instagram
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..
