Shilpa Shirodkar: 33 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
టాలీవుడ్ క్రేజీ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న కొత్త సినిమా జటాధర. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెకు తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

యంగ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
బ్రహ్మ తర్వాత ఈ సినిమాతో మళ్లీ తెలుగులోకి వస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇందులో శోభ అనే క్యారెక్టర్ కనిపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. తనకి డబ్బంటే అత్యాశ. ఎలాగైనా సరే రిచ్ అయిపోవాలి అనుకునే క్యారెక్టర్. సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అన్నారు శిల్పా శిరోధ్కర్. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఈ క్యారెక్టర్ ప్లే చేయడం చాలా చాలెంజింగ్ గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు. అయితే మా డైరెక్టర్స్ క్లియర్ విజన్, సపోర్ట్ తో ఈ క్యారెక్టర్ని చేయగలిగాను. జటాధరతో రీఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు శిల్పా శిరోధ్కర్.
అదేవిధంగా ఆమె మాట్లాడుతూ.. సుధీర్ బాబు గారితో కలిసి వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఈ జనరేషన్ యాక్టర్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సుదీర్ బాబు గారు చాలా డెడికేషన్ తో ఈ ప్రాజెక్టు చేశారు. తన 100% ఎఫర్ట్ పెట్టారు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సుధీర్ బాబు గారు మాకు రిలేటివ్. అయినప్పటికీ మేము చాలా ప్రొఫెషనల్ గా ఉంటాము. సెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మేము కేవలం యాక్టర్స్ మాత్రమే. మహేష్ బాబు గారు మా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఇండస్ట్రీలోకి వెల్కం చెప్పడం మరింత హ్యాపీనెస్ ఇచ్చింది. పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. కంటెంట్ పరంగా టెక్నికల్ గా చాలా అడ్వాన్స్ అయ్యాము. ప్రస్తుతం తెలుగు సినిమా బెస్ట్ పేజ్ లో ఉంది. ఇది మంచి సూపర్ నేచురల్ థ్రిల్లర్. స్టన్నింగ్ విజువల్స్ ఉంటాయి. ఎమోషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి మ్యూజిక్ ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఖచ్చితంగా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నాకు రొమాంటిక్ కామెడీలు ఇష్టం, మంచి సినిమాలు చేయడమే నా డ్రీం.. అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








