Shalini Pandey: ఆ స్టార్ హీరోయిన్‌తో పోలిక.. అస్సలు నచ్చట్లేదంటోన్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. ఎందుకంటే..
తొలి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది హీరోయిన్ షాలిని పాండే. అందం.. అంతకు మించిన అమాయకత్వంతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుందని అనుకున్నారు అంతా..కానీ అలా కాకుండా తెలుగులో ఈ బ్యూటీకి అసలు ఆఫర్స్ రాలేదు.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హీరౌ విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇది. ఈ మూవీతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ షాలిని పాండే. అందం, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. అలాగే కొన్ని సందర్భాల్లో సెకండ్ హీరోయిన్ గా మెరిసిన షాలిని..ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా బీటౌన్ స్టార్ హీరోయిన్ తో తనను పోల్చడం అస్సలు నచ్చదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. వేరే నటితో తనను పోల్చి చూడడం తనకు ఏమాత్రం నచ్చలేదని.. తనను తనలా గుర్తిస్తే చాలని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
షాలిని మాట్లాడుతూ.. “ప్రేక్షకులు నన్నెంతగానో ప్రేమిస్తున్నారు. వారందరిప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. కానీ కొందరు ఫ్యాన్స్ నన్ను హీరోయిన్ అలియా భట్ తో పోలుస్తూ తమ ప్రేమను తెలియజేస్తున్నారు. మనకు ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక అలియాఉన్నారు. కాబట్టి ఆమెలా మరొకరు అవసరంలేదు. ఆమెలా ఉండాలని వేరొకరు అనుకోరు. ఎందుకంటే ఆమె అద్భుతమైన నటి. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఆమె ఎంతో ఉన్నతంగా ఉంటారు. నేను స్పూర్తిగా తీసుకుంటాను.. అనేక విషయాలను నేర్చుకోవాలని అనుకుంటాను.. కానీ ఆమెతో నన్ను పోలిస్తే మాత్రం అస్సలు నచ్చదు. నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని నా ఉద్దేశం” అంటూ చెప్పుకొచ్చింది.
ఇటీవలే హిందీలో డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది షాలిని. ఇందులో షబానా అజ్మీ, జ్యోతిక కీలకపాత్రలు పోషించగా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఇప్పుడిప్పుడే హిందీలో పలు ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది షాలిని.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..