AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చేసినవి రెండు సినిమాలే.. రెండూ డిజాస్టర్లు.. ఈ బ్యాడ్ లక్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చి కొద్ది సంవత్సరాలే అయింది. తెలుగులో రెండు సినిమాలు.. హిందీలో ఒక్క సినిమానే చేసింది. ఇదిలా ఉంటే.. ఆమె తెలుగులో చేసిన రెండు సినిమాలూ డిజాస్టర్లు. ఇప్పుడు సినీ ఆఫర్లే లేవు. మరి ఆమె ఎవరు.? ఏయే హీరోల సరసన నటించిందో ఇప్పుడు తెలుసుకుందామా..

Tollywood: చేసినవి రెండు సినిమాలే.. రెండూ డిజాస్టర్లు.. ఈ బ్యాడ్ లక్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood
Ravi Kiran
|

Updated on: Apr 02, 2025 | 12:27 PM

Share

అందం, అభినయం ఉంటే సరిపోదు.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే.. ఆ రెండింటితో పాటు కూసింత అదృష్టం కూడా తోడవ్వాలి. కొందరు హీరోయిన్లు చేసిన మొదటి సినిమాకే ఓవర్‌నైట్ స్టార్ స్టేటస్ సంపాదిస్తే.. మరికొందరు ఎన్ని సినిమాలు చేసినా కూడా.. స్టార్ హీరోయిన్ కాలేకపోతున్నారు. ఈ కోవలోకి వచ్చే భామలు కొందరు ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పబోయే హీరోయిన్ కూడా ఆ కోవకు చెందిన బ్యూటీనే. ఈమె తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలే.. అయితే అవి రెండూ కూడా పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. తెలుగులో రవితేజ లాంటి స్టార్ హీరో సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. హిందీ వెబ్‌సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు.. అటు బాలీవుడ్‌లోనూ సరైన అవకాశాలు దక్కలేదు. బీ-టౌన్‌లోనూ ఈమె కేవలం ఒక్క సినిమాలోనే నటించింది. ఆమె ఎవరని అనుకుంటున్నారా.? మరెవరో కాదు హీరోయిన్ గాయత్రీ భరద్వాజ్.

2022లో ఇట్టు సే బాత్ అనే హిందీ చిత్రంలో నటించింది గాయత్రీ భరద్వాజ్. అయితే అంతకముందే దిన్‌దొర, ఇష్క్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు వెబ్‌ సిరీస్‌లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది గాయత్రీ భరద్వాజ్. ఇక 2023లో రవితేజ సరసన ‘టైగర్ నాగేశ్వరరావు’.. అలాగే 2024లో అల్లు శిరీష్ సరసన ‘బడ్డీ’ అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది గాయత్రీ. అయితే ఇవి రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి.

మరోవైపు అమ్మడు ‘హైవే లవ్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ సిరీస్‌లో ఇనాయ అనే రోల్‌లో తన అందంతో పాటు నటనతోనూ మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతుల్లో ఎలాంటి సినిమా ఆఫర్స్ లేకపోగా.. సోషల్ మీడియాలో మాత్రం ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది ఈ భామ. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?