Sai Pallavi: సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పనుందా? క్లారిటీ ఇచ్చిన న్యాచురల్‌ బ్యూటీ

గార్గి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు సాయి పల్లవి. కొత్త ప్రాజెక్టులకు కూడా సైన్‌ చేయలేదు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కించే చిత్రంలో అవకాశం వచ్చినా తిరస్కరించిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

Sai Pallavi: సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పనుందా? క్లారిటీ ఇచ్చిన న్యాచురల్‌ బ్యూటీ
Actress Sai Pallavi
Follow us

|

Updated on: Jan 08, 2023 | 9:35 AM

న్యాచురల్‌ బ్యూటీ సాయిపల్లవి గురించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఆమె సినిమాలకు స్వస్తి చెప్పనుందని, వైద్యురాలిగా స్థిరపడనుందని నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఒక ఆస్పత్రిని కూడా నిర్మించే పనిలో ఉందని పుకార్లు జోరుగా షికార్లు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే గార్గి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు సాయి పల్లవి. కొత్త ప్రాజెక్టులకు కూడా సైన్‌ చేయలేదు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కించే చిత్రంలో అవకాశం వచ్చినా తిరస్కరించిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కారణంగానే న్యాచురల్‌ బ్యూటీ సినిమా రంగానికి వీడ్కోలు పలుకుతుందంటూ రకరకాల వదంతులు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అందం అన్నది రూపంలో కాదని గుణంలో ఉందని చెప్పే ప్రేమమ్‌ చిత్రంతో నా సినీప్రయాణం ప్రారంభమైంది. ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధిస్తుందని అసలు ఊహించలేదు. ఆ చిత్రంలో టీచర్‌ ఇమేజ్‌ను మార్చడానికి వేరే తరహా పాత్రల్లో నటించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను’

‘నేను ఎంబీబీఎస్‌ చదివినా నటిని కావాలనుకున్నాను. దీనికి మా అమ్మానాన్నలు ఏ మాత్రం అడ్డు చెప్పలేదు .నేను నటించిన చిత్రాలు, పాత్రలు ప్రేక్షకులకు నచ్చాలనే భావిస్తాను. నన్ను అందరూ తమ ఇంటి ఆడపడుచుగా భావించడం సంతోషంగా ఉంది. మంచి కథలు లభిస్తే భాషాభేదం లేకుండా నటించడానికి సిద్ధం’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. దీంతో సినిమాలకు గుడ్‌డై చెప్పనుందంటూ ఆమెపై వస్తోన్న వార్తలు అసత్యమేనని తేల్చిపారేసింది. మరోవైపు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సాయి పల్లవిని మళ్లీ సిల్వర్‌ స్ర్కీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!