Weather Report: రాష్ట్రంపై వచ్చే 2 రోజులు చలి పంజా.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
డిసెంబర్ నెలాఖరులో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిలకు జారీ చేసింది. ముఖ్యంగా సోమ, మంగళ వారాల్లో దారుణంగా పడిపోనున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. అవసరమైతే తప్పబయటకు రావద్దంటూ హెచ్చరించింది..

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ రోజు, రేపు చలి తీవ్రత మరింత పెరుగుతుందని, కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధరణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్య అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ముఖ్యంగా అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఈ జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్,వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో వాతావరణ శాఖ అలర్ట్ జారీచేసింది.
ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇవే..
- ఆదిలాబాద్.. 8.2
- పటాన్ చెరువు.. 9.0
- రాజేంద్రనగర్.. 9.5
- మెదక్.. 9.0
- హనుమకొండ.. 11.0
- దుండిగల్..12.0
- రామగుండం.. 12.6
- నిజామాబాద్.. 12.9
- హైదరాబాద్.. 13.2
- హయత్ నగర్.. 14.0
- హకీంపేట్.. 14.0
- ఖమ్మం.. 14.6
- మహబూబ్ నగర్.. 15.0
- నల్గొండ.. 15.4
- భద్రాచలం.. 15.5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పెరుగుతున్న చలి దృష్ట్యా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, తెల్లవారుజాము, రాత్రి వేళల్లో అవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నారులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.




