Ritika Singh: రజినీ కాంత్ సినిమా షూటింగ్ సెట్‏లో ప్రమాదం.. హీరోయిన్‏కు గాయాలు..

శివలింగ, ఖోలా సినిమాల్లో నటించిన రితిక.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటిస్తుంది. జైలర్ సినిమా తర్వాత రజినీ ప్రస్తుతం టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తలైవా 170 అనే వర్కింగ్ టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొద్ది రోజుల క్రితమే రితిక ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది. అయితే మంగళవారం షూటింగ్ సెట్‏లో జరిగిన ప్రమాదంలో హీరోయిన్ రితిక గాయపడినట్లు తెలుస్తోంది.

Ritika Singh: రజినీ కాంత్ సినిమా షూటింగ్ సెట్‏లో ప్రమాదం.. హీరోయిన్‏కు గాయాలు..
Ritika Singh
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2023 | 3:48 PM

విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రితిక సింగ్. ఈ మూవీలో ఆమె సహజ నటనకు ప్రశంసలు అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో అటు తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. శివలింగ, ఖోలా సినిమాల్లో నటించిన రితిక.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటిస్తుంది. జైలర్ సినిమా తర్వాత రజినీ ప్రస్తుతం టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తలైవా 170 అనే వర్కింగ్ టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొద్ది రోజుల క్రితమే రితిక ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది. అయితే మంగళవారం షూటింగ్ సెట్‏లో జరిగిన ప్రమాదంలో హీరోయిన్ రితిక గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది రితిక.

‘నాకు తోడేలుతో పోరాడినట్లు అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలని అందరూ హెచ్చరించారు. కానీ నేను గాయపడ్డాను. అందుకు చాలా బాధగా ఉంది. కొన్నిసార్లు వేగాన్ని నియంత్రించడం కష్టం. నా నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగింది. కానీ ఇప్పుడు నొప్పి లేదు. గాయం లోతుగా తగిలింది. ట్రీట్‌మెంట్ కోసం షూట్ నుంచి హాస్పిటల్‌కి వెళ్తున్నా. ఆరోగ్యంగా ఉన్న తర్వాత మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాను’ అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Ritika Singh

Ritika Singh

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

డైరెక్టర్ టీఎస్.జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సుధీర్ఘ విరామం తర్వాత అమితాబ్, రజినీ కలిసి నటిస్తున్నారు. ఇందులో భగత్ బాసిల్, రానా , మంజు వారియర్, దుషార విజయన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.