Renu Desai: ‘నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తా’.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ కు సామాజిక స్పృహ ఎక్కువ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆమె సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యలపై తన గళం వినిపిస్తుంటారు. తాజాగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది
ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ కు సామాజిక స్పృహ ఎక్కువ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆమె సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యలపై తన గళం వినిపిస్తుంటారు. తాజాగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల కోల్‌కత్తాలోని ఆర్‌జీ కేర్ మెడికల్ హాస్పిటల్‌లో ఓ ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ‘మరో నిర్భయ ఘటన’ అంటూ అందరూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఘోరంపై స్పందిస్తున్నారు. ఉపాసన కొణిదెల, హృతిక్ రోషన్, కరీనా కపూర్, అలియా భట్, అయుష్మాన్ ఖురానా తదితరులు కోల్ కతా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో రేణూ దేశాయ్ కూడా కూడా స్పందించారు. ఈ ఘటన జరిగిన రోజు నుంచి సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉన్నారామె. తాజాగా ఇదే ఘటనపై మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు రేణు దేశాయ్.
‘మీ కొడుకుకు మహిళలను ఎలా గౌరవించాలో నేర్పించండి.. ఎందుకంటే నేను కూడా నా కుమార్తెకు ఎముకలు విరగొట్టడం నేర్పించబోతున్నాను’ అని ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. దీనికి బ్యాక్ గ్రౌండ్‌లో కరాటే నేర్పిస్తున్న ఫొటో ను జత చేసింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు రేణు నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ‘గుడ్ డెసిషన్ మేడమ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
రేణూ దేశాయ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
ప్రస్తుతం సింగిల్ మదర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తున్నారు రేణూ దేశాయ్. ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారామె. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తున్నారు. అలాగే పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా ప్రకృతి, మూగజీవాల పై తన ప్రేమను చూపిస్తున్నారు. ఇందుకోసం తన వంతు సాయం చేయడంతో పాటు విరాళాలు కూడా సేకరిస్తున్నారు.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.