Raveena Tandon: ‘నన్ను క్షమించండి.. ఇంకా నేను భయపడుతున్నాను’.. కేజీఎఫ్ నటి..

తాజాగా ఈ ఘటనపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు రవీనా. తాను ఇంకా ముంబైలోని బాంద్రాలో జరిగన ఘటన నుంచి తేరుకోలేదని.. ఇప్పటికీ ఆ ఘటనతో ఎంతో భయపడుతున్నానని తెలిపారు. అందుకే లండన్ లో ఫోటో అడిగితే ఇవ్వలేదంటూ కారణాన్ని వివరించింది.

Raveena Tandon: 'నన్ను క్షమించండి.. ఇంకా నేను భయపడుతున్నాను'.. కేజీఎఫ్ నటి..
Raveena Tandon
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2024 | 1:35 PM

బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లండన్ వెళ్లినప్పుడు కొందరు అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అయితే వారికి ఫోటో ఇవ్వకుండానే వేగంగా వెళ్లిపోయింది. దీంతో ఆమె తీరుపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేశారు. అభిమానులకు ఫోటో కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారు.. యాటిట్యూడ్ అంటూ రవీనాను ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేశారు నెటిజన్స్. తాజాగా ఈ ఘటనపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు రవీనా. తాను ఇంకా ముంబైలోని బాంద్రాలో జరిగన ఘటన నుంచి తేరుకోలేదని.. ఇప్పటికీ ఆ ఘటనతో ఎంతో భయపడుతున్నానని తెలిపారు. అందుకే లండన్ లో ఫోటో అడిగితే ఇవ్వలేదంటూ కారణాన్ని వివరించింది.

‘నేను లండన్‌లో ఓ వీధిలో నడుస్తున్నప్పుడు కొందరు వచ్చి సెల్ఫీ అడిగారు. నేను వద్దు అని చెప్పి వేగంగా వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. కొన్ని నెలల క్రితం బాంద్రాలో జరిగిన ఘటన భయం ఇంకా నాలో అలాగే ఉంది. నా చుట్టూ ప్రజలు ఉన్నప్పుడు నాకేలాంటి భయం ఉండదు. కానీ అప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. అందుకే వేగంగా వెళ్లిపోయాను. ముంభై ఘటన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. వారికి ఫోటో ఇవ్వాలని నా మనసుకు అనిపించింది. కానీ ధైర్యం చేయలేకపోయాను. నేను సహాయం కోసం సెక్యూరిటీ గార్డుని కూడా పిలిచాను. ఇది చదివిన ఎవరైనా సెల్ఫీ కోసం అడిగితే క్షమించండి. వారికి విసుగు తెప్పించడం నా ఉద్దేశ్యం కాదు. నిజంగా క్షమించండి. ఒక రోజు నేను మిమ్మల్ని కలిసి సెల్ఫీ తీసుకుంటాను’ అని రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇటీవల రవీనా కారు ప్రమాదానికి గురైంది. ఆమె కారు డ్రైవర్ పై కొందరు దాడికి ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మా పై దాడి చేయకండి అంటూ రవీనా విజ్ఞప్తి చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఆ సమయంలో రవీనా మద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఆమె మద్యం తాగలేదని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన జూన్ నెలలో జరిగింది.

రవీనా ట్వీట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్