AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: రకుల్ చెంప చెళ్లుమనిపించిన ఆమె సోదరుడు.. పాపం అంటున్న నెటిజన్స్..

కానీ రాఖీ పండగ రోజే ప్రముఖ హీరోయిన్ రకుల్ (Rakul Preet Singh) చెంప పగలకొట్టాడు ఆమె సోదరుడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది రకుల్. ఇంతకీ వారిద్దరి మధ్య ఏం జరిగింది ?

Rakul Preet Singh: రకుల్ చెంప చెళ్లుమనిపించిన ఆమె సోదరుడు.. పాపం అంటున్న నెటిజన్స్..
Rakul
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 12, 2022 | 1:15 PM

Share

అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల ప్రేమకు.. అనుబంధానికి ప్రతిరూపమే రాఖీ పౌర్ణమి. ఈ ప్రత్యేక పర్వదినాన్ని కులమతాలకతీతంగా ప్రతి సోదరీసోదరులు జరుపుకుంటారు. నీకు నేను రక్షా.. నాకు నువ్వు రక్షా అంటూ తమ మధ్య అనున్న అనురాగాన్ని చెప్పుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగను అత్యంత సంబరంగా చేసుకుంటారు. అత్తింటి నుంచి వచ్చిన ఆడపడుచులకు ప్రేమతో కానుకలు ఇవ్వడమే కాకుండా నేనున్నానే భరోసా కల్పిస్తారు సోదరుడు. హిందూ సంప్రదాయంలో రాఖీ పండుగకు ప్రత్యేకత ఉంది. అయితే ఈ నెలలో రెండు రోజులు రాఖీ పౌర్ణమి జరుపుకునే వీలు కల్గింది. ఆగస్ట్ 11 మధ్యాహ్నం నుంచి 12న ఉదయం వరకు స్త్రీలు తమ సోదరులకు రాఖీలు కట్టుకోవచ్చు. ఇప్పటికే సామాన్య ప్రజలతోపాటు.. సెలబ్రెటీలు ఘనంగా రాఖీ పండగను జరుపుకుంటున్నారు. కానీ రాఖీ పండగ రోజే ప్రముఖ హీరోయిన్ రకుల్ (Rakul Preet Singh) చెంప పగలకొట్టాడు ఆమె సోదరుడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది రకుల్. ఇంతకీ వారిద్దరి మధ్య ఏం జరిగింది ? ఫెస్టివల్ రోజునే ఎందుకు కొట్టాడో తెలుసుకోవాల్సిందే.

ఆ వీడియోలో రకుల్.. ఆమె సోదరుడు అమన్ ఇద్దరు ఓ ఛాలెంజ్ పెట్టుకున్నారు. వాటర తాగి.. వన్ టూ త్రీ అంటూ చేతి వేళ్లను ఒకేసారి చూపించాలి. ఇందులో ముందు ఆమె సోదరుడు ఓడిపోగా రకుల్ అతడి చెంపను బలంగా కొట్టింది. ఆ తర్వాత రకుల్ ఓడిపోగా.. ఆమె చెంప పగలగొట్టాడు. ఈ ఫన్నీ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. మేమిద్దరం జత కడతాం. మేము గొడవ పడతాము. చివరకు మేము ఇద్దరం తిరిగి కలిస్తాము. నేను నిన్ను ఎల్లప్పుడు ప్రేమిస్తున్నాను. మేమెప్పుడు ఒకరికొకరం తోడుగా ఉంటామని నాకు తెలుసు. రక్షా బంధన్ శుభాకాంక్షలు అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.