Naga Chaitanya: ‘నా రిలేషన్ షిప్ స్టేటస్ ఇప్పటికీ అదే’.. చైతూ ఆన్సర్ వేరేలెవల్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం చైతూ రిలేషన్‏షిప్ స్టేటస్ ఏంటనీ యాంకర్ ప్రశ్నించగా.. దీంతో చైతన్య చిన్న

Naga Chaitanya: 'నా రిలేషన్ షిప్ స్టేటస్ ఇప్పటికీ అదే'.. చైతూ ఆన్సర్ వేరేలెవల్..
Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 11, 2022 | 2:30 PM

ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ఫస్ట్ హిందీ మూవీ లాల్ సింగ్ చద్దా ఈరోజు (ఆగస్ట్ 11న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ఫారెస్ట్ గంప్ రీమేక్‏‏గా తెరకెక్కిన ఈ మూవీకి ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించగా.. దక్షిణాది కుర్రాడు బాలరాజు పాత్రలో చైతూ కనిపించాడు. ఈ సినిమా హిందీతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషలలో ఈరోజు గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గోన్న చైతూకు సినిమా కంటే ఎక్కువ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి. దీంతో ఒకానొక సమయంలో తన వ్యక్తిగత జీవితం గురించి ప్రజలు చూపిస్తున్న ఆసక్తిపట్ల విసుగ్గా ఉందని తెలిపారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం చైతూ రిలేషన్‏షిప్ స్టేటస్ ఏంటనీ యాంకర్ ప్రశ్నించగా.. దీంతో చైతన్య చిన్న చిరునవ్వు చివరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. రిలేషన్‏షిప్ స్టేటస్ అంటే ప్రస్తుతం కేవలం స్ల్మైల్ మాత్రమే అని అన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఆకస్మాత్తుగా సమంత తనకు ఎదురుపడితే హగ్ ఇచ్చి హాయ్ చెప్తానన్నారు.

అలాగే మళ్లీ ప్రేమను జీవితంలోకి ఆహ్వానిస్తారా అని అడగ్గా.. ప్రపంచం మొత్తం ప్రేమ చుట్టూ తిరుగుతుందని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం కష్టమన్నారు చైతూ. ప్రస్తుతం చైతన్య అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ధూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫాం అరంగేట్రం చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో చైతూ ఓ సినిమా చేయనున్నారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే