Suriya: జైభీమ్ వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు.. హీరో సూర్య దంపతులపై..

జైభీమ్ సినిమాలోని పలు సన్నివేశాలు కొన్ని వర్గాలను తప్పుగా చిత్రీకరించారని. వారి మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

Suriya: జైభీమ్ వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు.. హీరో సూర్య దంపతులపై..
Suriya
Follow us

|

Updated on: Aug 11, 2022 | 5:18 PM

డైరెక్టర్ జ్ఞానవేల్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన జైభీమ్ (Jai Bhim) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. లిజోమోల్, మణికందన్, సూర్య ప్రధాన పాత్రలో కనిపించిన ఈ మూవీ గతేడాది నవంబర్‏లో ఓటీటీలో విడుదలై మంచి విజయం అందుకుంది. దక్షిణాది ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాపై గతకొద్ది రోజులుగా మద్రాసు హైకోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పలు సన్నివేశాలు ఓ వర్గం వారిని కించపరిచేలా ఉన్నాయంటూ  హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం సూర్యతో, జ్యోతికతోపాటు, డైరెక్టర్జ్ జ్ఞానవేల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తాజాగా ఆగస్ట్ 11న విచారణ జరిపిన కోర్టు ఈ కేసును రద్దు చేసింది.

వివరాల్లోకెలితే జైభీమ్ సినిమాలోని పలు సన్నివేశాలు కొన్ని వర్గాలను తప్పుగా చిత్రీకరించారని. వారి మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వారు పూజించే అక్కిని కుండం, మహాలక్ష్మీ దేవిని ఉద్దేశించి సన్నివేశాలు ఏర్పాటు చేయడంతో చిత్రనిర్మాత జ్యోతిక, హీరో సూర్య, డైరెక్టర్ జ్ఞానవేల్ పై రుద్ర వన్నియా సేన వ్యవస్థాపకుడు సంతోష్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సైదాపేట కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని గతేడాది సైదాపేట కోర్టు ఆదేశించగా వేలాచ్చేరి పోలీసులు సూర్యతో పాటు దర్శకుడిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తును కొట్టివేయాలని, సూర్యతోపాటు, డైరెక్టర్ పై నమోదైన కేసును రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. రిటైర్డ్ అడ్వైకేట్ చందు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిని సినిమా మాత్రమే అని.. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదంటూ చిత్రయూనిట్ కోర్టుకు వివరణ ఇచ్చింది. అంతేకాకుండా సినిమాలోని అగ్నిగుండం, మహాలక్ష్మీ క్యాలెండర్ సన్నివేశాలను విడుదలకు ముందే తొలగించామని సూర్య తెలిపారు. ఆయా వర్గాలను కించపరిచేలా సీన్ సెట్ చేయారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని లాయర్ వాదించారు. విచారణ అనంతరం. సూర్య , జ్యోతిక, డైరెక్టర్ పై ఉన్న కేసును రద్దు చేస్తున్నట్లు తీర్పునిచ్చింది చెన్నై న్యాయస్థానం.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..