AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ఇండస్ట్రీలో తాజా పరిస్థితులపై బాలయ్య సీరియస్‌.. నిర్మాతల నిర్ణయంపై అసహనం

Nandamuri Balakrishna: పొలిటికల్ ఇష్యూస్‌ వల్ల గ్యాప్ వస్తే తప్ప... షూటింగ్ సెట్టుకు సెలవు ఇవ్వటం అన్నది బాలయ్య హిస్టరీలోనే లేదు. అందుకే  ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్‌ ఇవ్వటం విషయంలో నిర్మాతలపై బాలయ్య ఫైర్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. 

Balakrishna: ఇండస్ట్రీలో తాజా పరిస్థితులపై బాలయ్య సీరియస్‌.. నిర్మాతల నిర్ణయంపై అసహనం
Balakrishna
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Aug 11, 2022 | 5:01 PM

Share

షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వడం విషయంలో ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి ఇదే సరైన మార్గమని కొంత మంది అంటుంటే… ఈ నిర్ణయం ఇండస్ట్రీకే నష్టమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తాజా నందమూరి నటసింహం బాలయ్య కూడా ఇండస్ట్రీ పరిస్థితులపై కాస్త సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారట. సినిమా సినిమాకు మధ్య ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడానికి ఇష్టపడరు నందమూరి బాలకృష్ణ. రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతారు. ఒక ప్రాజెక్ట్ తర్వాత మరో ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెడుతారు.  పొలిటికల్ ఇష్యూస్‌ వల్ల గ్యాప్ వస్తే తప్ప… షూటింగ్ సెట్టుకు సెలవు ఇవ్వటం అన్నది బాలయ్య హిస్టరీలోనే లేదు. అందుకే  ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్‌ ఇవ్వటం విషయంలో నిర్మాతలపై బాలయ్య ఫైర్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది.

‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న బాలయ్య వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 15 నుంచి టర్కీలో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు మేకర్స్‌. కానీ ఇండస్ట్రీలో షూటింగ్‌లకు బంద్‌ చేయటంతో ఈ షెడ్యూల్ వాయిదా పడింది.

ఈ విషయంలోనే మైత్రీ నిర్మాతలకు గట్టిగా క్లాస్ ఇచ్చారట బాలయ్య. ఫారిన్ షెడ్యూల్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని… చాలా మంది ఆర్టిస్ట్‌ల కాంబినేషనేషన్స్‌ సెట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి షెడ్యూల్‌ వాయిదా వేస్తే మళ్లీ ఆ కాంబినేషన్స్‌ సెట్ చేయడానికి ఎంత టైమ్ పడుతుంది? ఎంత మనీ వేస్ట్ అవుతుంది? అని సీరియస్‌ అయ్యారట. అయితే ప్రజెంట్‌ ఇండస్ట్రీలో సిచ్యుయేషన్‌ గురించి బాలయ్యకు వివరించి సర్థిచెప్పే ప్రయత్నం చేసిన నిర్మాతలు… షెడ్యూల్‌ పోస్ట్‌పోన్‌ చేసేందుకు బాలయ్యను ఒప్పించారు. ఆయన సరే అన్నా… ప్రస్తుతం షూటింగ్‌లు బంద్‌ చేయటంపై బాలయ్య మాత్రం సీరియస్‌గానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

బాలయ్యతో మాట్లాడిన తరువాత త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ముందు అనుకున్న టైమ్‌కు కాకపోయినా.. కాస్త ఆలస్యంగా ఈ నెల 24 నుంచి టర్కీ షెడ్యూల్‌ స్టార్ట్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..