Naga Chaitanya-Samantha: సామ్ గురించి క్రేజీ క్వశ్చన్స్.. నాగచైతన్య ఇచ్చిన స్ట్రైయిట్ ఆన్సర్స్ ఇవే

Tollywood: తాజాగా మీడియా ముందుకు వచ్చిన చైకి, సమంత మీకు ఎదురు పడితే ఎలా రియాక్ట్ అవుతారు? అన్న ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా ఆన్సర్‌ చేశారీ నవ మన్మథుడు.

Naga Chaitanya-Samantha: సామ్ గురించి క్రేజీ క్వశ్చన్స్.. నాగచైతన్య ఇచ్చిన స్ట్రైయిట్ ఆన్సర్స్ ఇవే
Samantha Nagachaitanya
Follow us

|

Updated on: Aug 11, 2022 | 4:13 PM

Tollywood: వాళ్లిద్దరు విడిపోయి పది నెలలు అవుతున్నా.. ఇంకా వాళ్ల ప్రేమ, పెళ్లి, విడాకులకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. ప్రజెంట్ ఇద్దరు ప్రొఫెషనల్‌ కెరీర్‌లో బిజీ అయినా… పర్సనల్ లైఫ్ వాళ్లను వెంటాడుతోంది. ముఖ్యంగా మీడియాను ఎదురు పడినా విడాకులకు సంబంధించిన ప్రశ్నలే ఎదురువుతున్నాయి. ఈ ప్రశ్నలకు.. సామ్‌ – చై(Chay-Sam) ఇస్తున్న సమాధానాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. లాల్‌ సింగ్‌ చడ్డా(laal singh chaddha) సినిమాతో బాలీవుడ్(bollywood) ఎంట్రీ ఇస్తున్నారు యంగ్ హీరో నాగచైతన్య. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతుండటంతో ఆ ప్రమోషన్‌ బాధ్యతలు తానే తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు చై. అయితే ఈ ఇంటర్వ్యూస్‌లో ఎక్కువగా సమంతకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతుండటంతో ఇబ్బంది పడుతున్నారు చై. తాజాగా మీడియా ముందుకు వచ్చిన చైకి, సమంత మీకు ఎదురు పడితే ఎలా రియాక్ట్ అవుతారు? అన్న ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా ఆన్సర్‌ చేశారీ నవ మన్మథుడు. సామ్‌ ఎదురుపడితే హాయ్‌ చెప్పి హగ్ ఇస్తానంటూ ప్రశ్న అడిగిన వారి మైండ్ బ్లాక్ చేశారు. చాన్స్ వస్తే మరోసారి సామ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కూడా రెడీ అన్నారు. అంతేకాదు తన చేతి మీద ఉన్న పెళ్లి డేట్ టాటూను మార్చే ఉద్దేశం కూడా లేదని షాక్ ఇచ్చారు చై.

చై సాఫ్ట్‌గా రియాక్ట్ అవుతుంటే సమంత తీరు మాత్రం ఇష్యూ పెద్దది చేయాలని భావిస్తున్నట్టుగానే అనిపిస్తోంది. రీసెంట్‌గా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సామ్‌… చైతో రిలేషన్‌ గురించి హాట్ కామెంట్స్‌ చేశారు. కరణ్ సినిమాల్లో పెళ్లి అంటే కబీ ఖుషీ కబీ ఘమ్‌ చూపిస్తారని.. కానీ పెళ్లి తరువాత లైఫ్‌ కేజీఎఫ్‌ లా ఉంటుందని సెటైర్ వేశారు. అంతేకాదు చైని తనని ఒకే రూమ్‌లో ఉంచితే ఆ రూమ్‌లో పదునైన ఆయుధాలు కూడా ఉంచాలంటూ తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పేశారు. అయితే ఈ విషయంలో రెండు వర్గాలకు సాలిడ్ సపోర్ట్ కూడా వినిపిస్తోంది. విడాకుల తరువాత సోషల్ మీడియాలో సమంతను టార్గెట్‌ చేస్తూ గట్టిగానే ట్రోలింగ్ జరిగింది. ఆమె భరణం తీసుకున్నారని.. సమంత బిహేవియర్‌ వల్లే విషయం విడాకుల దాకా వచ్చిందని తిట్టిపోశారు నెటిజెన్స్‌. ఈ కామెంట్స్‌తో విసిగిపోయిన సమంత అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతున్నారన్నది సామ్‌ ఫ్యాన్స్ వైపు నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇలాంటి ట్రోల్స్‌ చై కూడా ఫేస్‌ చేశారని, అయిన హుందాగా తను ఉండటం చూసి సామ్ చాలా నేర్చుకోవాలి అని చెబుతున్న వారు కూడా లేకపోలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!