Tamannah: మిల్కీబ్యూటీకి బంపర్ ఆఫర్.. ఏకంగా సూపర్ స్టార్ సినిమాలోనే ఛాన్స్..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది.

దక్షిణాది చిత్రపరిశ్రమలో తమన్నా స్థానం ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇప్పటికీ యువతరం కథానాయికలుగా గట్టి పోటీనిస్తుంది మిల్కీబ్యూటీ (Tamannah). ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో ఆడియన్స్ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో మిల్కీబ్యూటీ నటించనుందట.
డైరెక్టర్ నెల్సన్ కుమార్, సూపర్ స్టార్ రజినీ కాంత్ కాంబోలో రాబోతున్న జైలర్ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. రోజు రోజుకీ ఈ సినిమాలో నటించే తారాగణం సంఖ్య పెరిగిపోతుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించనుండగా.. ఇప్పుడు తమన్నా కూడా కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. చిత్రీకరణ కోసం భారీ సెట్లు వేశారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్లో తమన్నా జాయిన్ కానుందని తెలుస్తోంది. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.




View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
