Shruti Haasan: ‘ఇండస్ట్రీ కాదు..ఈ సమాజమే అలా ఉంది’.. షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్..
చిత్రీకరణలోనే కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే శ్రుతి తాజాగా ఇండస్ట్రీ, సమాజం గురించి సంచలన కామెంట్స్ చేసింది.
చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో మరోసారి ఫాంలోకి వచ్చింది శ్రుతి హాసన్. రవిజేత, శ్రుతిహాసన్ (Shruti Haasan) జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమాలో శ్రుతి నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య చిత్రంలోనూ కనిపించనుంది. చిత్రీకరణలోనే కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే శ్రుతి తాజాగా ఇండస్ట్రీ, సమాజం గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రుతికి.. సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంది కదా అనే ప్రశ్న ఎదురైంది. దీంతో కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు..సమాజంలో కూడా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉందని తెలిపింది.
శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. ” వాస్తవానికి మనం పురుషాధిక్య సమాజంలో జీవిస్తున్నామని అనుకుంటున్నాను. కేవలం సినీ పరిశ్రమలోనే పురుషాధిక్యత ఉందంటే నేను అంగీకరించను. మనం చూసే కథలకు ప్రతిబింబం సినిమా. నేను ఒక నటిగా..కళ జీవితాన్ని అనుసరిస్తున్నాను. ” అని అన్నారు. ప్రస్తుతం సలార్ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇందులో శ్రుతి హాసన్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న NBK 107 చిత్రంలో నటిస్తుంది.