Laal Singh Chaddha Review: లాల్ సింగ్ చద్దా రివ్యూ.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టేనా ?
లాల్ సింగ్ చడ్డా పాత్రలో అమీర్ ఖాన్ ఒదిగిపోయాడు. బుద్ధి మాంద్యం ఉన్న వారు ఇలానే ఉంటారేమో అనేంతలా వారి స్వభావాన్ని అర్ధం చేసుకుని ఒదిగి నటించాడు.
‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాతో అమీర్ ఖాన్ సుదీర్ఘ గ్యాప్ తరువాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 4 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయన బిగ్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. అతుల్ కులకర్ణి రచించగా అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆరు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి అధికారిక హిందీ రీమేక్. ఈ సినిమా హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ, లాల్ సింగ్ చడ్డా’ టీమ్ ఇండియన్ ఒరిజినాలిటీ కోసం చాలా కష్టపడింది. ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సినిమాను చిరంజీవి నాగార్జున ప్రమోట్ చేయడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి.
సినిమా రివ్యూ: లాల్ సింగ్ చడ్డా.
నటీనటులు: అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగచైతన్య, మోనా సింగ్
సినిమాటోగ్రఫీ : సత్యజిత్ పాండే (సేతు)
సంగీత దర్శకుడు : తనూజ్ టికు, ప్రీతమ్.
ఎడిటర్ : హేమంతి సర్కార్
నిర్మాత: అమీర్ కాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధరే.
దర్శకత్వం : అద్వైత్ చందన్.
విడుదల తేదీ : 2022 ఆగస్ట్ 11
కథ:
పంజాబ్ లోని పఠాన్ కోట్ అనే ప్రాంతంలో ఒక సాంప్రదాయ సిఖ్ -మిలిటరీ ఫ్యామిలీలో అంగవైకల్యంతో పుట్టిన లాల్ సింగ్ చడ్డా(అమీర్ ఖాన్) చిన్ననాటి నుంచి అనేక సవాళ్లు ఎదుర్కొని ముందుకు వెళ్తాడు. ముందుగా తన తల్లి, తరువాత రూప(కరీనా కపూర్) ఇచ్చిన సపోర్ట్ తో అంగవైకల్యాన్ని జయించి మిలిటరీలో చేరతాడు. అక్కడ పరిచయం బాలరాజు(నాగచైతన్య)కు వ్యాపారంలో భాగస్వామిని అవుతానని ఇచ్చిన మాట కోసం మిలిటరీ సర్వీస్ పూర్తయ్యాక ఆ వ్యాపారంలో దిగుతాడు. అక్కడి నుంచి కోట్లకు పడగ ఎత్తినా జీవితంలో ఏదో తెలీని లోటు. ఎవరూ లేని ఒంటరి తనాన్ని లాల్ ఎలా దూరం చేసుకున్నాడు. ఆ క్రమంలో ఎలాంటి పరిస్థితులు చూశాడు ? అనేదే సినిమా.
విశ్లేషణ:
అతుల్ కులకర్ణి నటుడిగా మాత్రమే మనకి తెలుసు కానీ ఈ సినిమాతో సత్తా చాటే ప్రయత్నం చేశాడు. ఒక రీమేక్ లా కాకుండా ఈ సినిమా కొత్త సినిమా అనే ఫీల్ కలిగించడంలో అద్వైత చందన్ సఫలం అయ్యారు.అయితే లాల్ సింగ్ చడ్డా సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది కానీ తెలుగు వారికి కనెక్ట్ అవడం కష్టం. పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాని ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. పాత్రలు తెలుగులో మాట్లాడినంత మాత్రాన తెలుగు వారికి కనెక్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయమే. అదీ కాక సినిమాలో లాజిక్ లెస్ సీన్లు అనేకం ఉన్నాయి. కథకు తెలుగు వారు కనెక్ట్ అవలేరు, నాగచైతన్య పాత్ర కూడా ట్రోల్ మెటీరియల్ లా ఉంటుంది. చైతూ పాత్రకు న్యాయం చేశాడు కానీ కావాలని మూతి ముందుకు పెట్టి మాట్లాడించడం లాంటివి మన వాళ్లకి నచ్చవు.. దానికి తోడు బాయ్ కాట్ ట్రెండ్ ఉండనే ఉంది.. ఏదో అద్భుతం జరిగితే తప్ప సినిమాకి కలెక్షన్స్ రావడం కష్టమే..
నటీనటులు :
లాల్ సింగ్ చడ్డా పాత్రలో అమీర్ ఖాన్ ఒదిగిపోయాడు. బుద్ధి మాంద్యం ఉన్న వారు ఇలానే ఉంటారేమో అనేంతలా వారి స్వభావాన్ని అర్ధం చేసుకుని ఒదిగి నటించాడు. కరీనా కూడా చాలా కాలం తరువాత నటనలో తన మార్క్ చూపింది. ఆమె తన పాత్ర పరిధి మేర నటించి ఆకట్టుకుంది. నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇలాంటి పాత్రతో చేస్తాడని ఊహించము కానీ నటనాపరంగా ఎక్కడా తగ్గేదేలే అంటూ ఆకట్టుకున్నాడు. మిగతా వారు తమ తమ పరిధి మేర నటించారు.
ముగింపు :
లాల్ సింగ్ చడ్డా సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది కానీ తెలుగు వారికి కనెక్ట్ అవడం కష్టం. పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాని ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. పాత్రలు తెలుగులో మాట్లాడినంత మాత్రాన తెలుగు వారికి కనెక్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయమే. అదీ కాక సినిమాలో లాజిక్ లెస్ సీన్లు అనేకం ఉన్నాయి. కథకు తెలుగు వారు కనెక్ట్ అవలేరు, నాగచైతన్య పాత్ర కూడా ట్రోల్ మెటీరియల్ లా ఉంటుంది. చైతూ పాత్రకు న్యాయం చేశాడు కానీ కావాలని మూతి ముందుకు పెట్టి మాట్లాడించడం లాంటివి మన వాళ్లకి నచ్చవు.. దానికి తోడు బాయ్ కాట్ ట్రెండ్ ఉండనే ఉంది.. ఏదో అద్భుతం జరిగితే తప్ప సినిమాకి కలెక్షన్స్ రావడం కష్టమే.
లక్ష్మీ నారాయణ, ఎడిటర్, టీవీ9 ET