Rakul Preet Singh: క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్స్ అయినా పెట్టేస్తారా ? ఆంగ్ల పత్రికపై ఫైర్ అయిన రకుల్…
రకుల్ ప్రీత్ సింగ్.. తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు ఇప్పుడు

రకుల్ ప్రీత్ సింగ్.. తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం సుమారు అర డజను సినిమాలు రకుల్ చేతిలో ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా రకుల్ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. దీంతో ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు రావడం లేదంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై రకుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలకు డేట్స్ సర్ధుబాటు చేయడంలో దయచేసి నా టీమ్ కు సహాయం చేయండంటూ కౌంటర్ వేసింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. లాక్ డౌన్ ఎత్తివేయడంతో.. సినిమా షూటింగ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నాను. కొన్నిసార్లు డేట్స్ సర్ధుబాటు కావడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ కు చెందిన ఓ ఆంగ్ల పత్రిక.. రకుల్ కు తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం లేదని.. అందుకే సినిమాలు చేయడం లేదని ఓ వార్త ప్రచురించింది. ఇది చూసిన రకుల్.. హెడ్ లైన్స్ కోసం ఏదైనా రాసేస్తారు అంటూ ట్విట్టర్ లో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇది నేను ఎప్పుడు చెప్పానా అని ఆశ్చర్యపోతున్నాను. ఫ్రెండ్స్ మనకు కేవలం 365 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను చేస్తున్న ఆరు సినిమాకు కాకుండా.. కొత్త ఆఫర్స్ కోసం దయచేసి నా డేట్స్ సర్ధుబాటు చేయడానికి నా టీమ్ కు సహాయం చేయండి. అంటూ ట్వీట్ చేసింది. దీనికి హెడ్ లైన్స్ కోసం ఏదైనా అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది. ఇక రకుల్ ట్వీట్ పై డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందిస్తూ.. నాకు తెలుగు రకుల్.. షూటింగ్స్ తో నువ్వు ఎంత బిజీగా ఉన్నావో.. ఇటీవల నా ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్ నీకు బాగా నచ్చినప్పటికీ.. నీ డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. కీపా రాకింగ్ రకుల్.. నీ సినిమాలతో అందరికి సమాధానం చెప్పు అని అన్నారు.
Also Read: Anchor Pradeep: ఏపీ రాజధానిపై స్పందించిన ప్రదీప్.. ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించండి అంటూ..
Samantha Akkineni: వ్యాపార రంగంలోకి స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారి కోడలు మరో అడుగు..




