AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: నా సర్వస్వం నువ్వే.. కిరణ్ అబ్బవరం గురించి హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం ఆతర్వాత ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో మరో హిట్ తనఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో వరుసగా ఆఫర్స్ అందుకున్నాడు కిరణ్. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.

Kiran Abbavaram: నా సర్వస్వం నువ్వే.. కిరణ్ అబ్బవరం గురించి హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
Kiran Abbavaram
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2024 | 6:44 AM

Share

టాలీవుడ్ లో దూసుకుపోతున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యంగ్ హీరో రాజావారు రాణిగారు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కిరణ్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం ఆతర్వాత ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో మరో హిట్ తనఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో వరుసగా ఆఫర్స్ అందుకున్నాడు కిరణ్. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. అయినా కూడా వెనకాడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ కుర్రహీరో పెళ్ళికి రెడీ అయ్యాడు. ఇటీవలే కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ జరిగింది.

తన మొదటి సినిమా హీరోయిన్ రహస్యతో ఆయన ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ ఇద్దరూ దాదాపు 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ వీరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు బయటకు రాలేదు. ఆ మధ్య ఒకటి రెండు వార్తలు వచ్చినా దాని పై ఇద్దరూ స్పందించలేదు. ఇక ఇప్పుడు ఇలా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తాజాగా తమ ప్రేమ గురించి హీరోయిన్ రహస్య మాట్లాడింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసింది.

కిరణ్ లానే రహస్య కూడా షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య సినిమాలను పక్కన పెట్టేసింది. ఎంగేజ్ మెంట్ తర్వాత తన ప్రేమ గురించి రహస్య సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ” ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు. మంచి స్నేహితులుగా ఉన్నాం. ప్రేమలో పడ్డాం. ఎన్నో మాట్లాడుకున్నాం. ఎలాంటి ప్లానింగ్ లేకుండానే చాలా ట్రిప్స్‌కి వెళ్లాం. ఎన్నో ఆటుపోట్లు చూశాం. మొత్తానికి మనిద్దరిదీ అద్భుతమైన, అందమైన జర్నీ. నీతోపాటు ఈ జర్నీని కంటిన్యూ చేయాలని చాలా ఆత్రుతగా ఉన్నాను. నా సర‍్వస్వం నువ్వే  కిరణ్ అబ్బవరం’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది రహస్య. అలాగే ఈ ఇద్దరికీ సంబందించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజావారు రాణిగారు సినిమాలోని డైలాగ్ తో ఓ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది.

Kiran

కిరణ్ అబ్బవరం , రహస్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి