Rashi Khanna: రూ. 40తో వారి ఒకపూట ఆకలిని తీర్చుతాం.. విరాళాలు ఇవ్వాలంటున్న రాశీ ఖన్నా.. రోటీ ఫౌండేషన్‌కి భారీగా విరాళాలు..
కరోనా రెండో దశ.. మరోసారి దేశ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అన్ని రంగాలపై దెబ్బకొట్టి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చింది.
కరోనా రెండో దశ.. మరోసారి దేశ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అన్ని రంగాలపై దెబ్బకొట్టి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చింది. అటు కరోనా కట్టడికి రాష్ట్రాలు లాక్ డౌన్ అమలుపరుస్తుండడంతో ఎంతో మంది పేద ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. చేయడానికి పనిలేక… లాక్ డౌన్ వలన బయటకు వెళ్లి సరుకులు కూడా తెచ్చుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇక కరోనా వలన ఇబ్బందులు ఎదుర్కోంటున్న వారికి అండగా.. పలువురు సినీ ప్రముఖులు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినీ సెలబ్రెటీలు తమకు తోచిన ఆర్థిక సాయం.. నిత్యావసర సరుకులు పంపిణి చేస్తుండగా.. తాజాగా ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా కూడా పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
రోటీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆకలితో ఉన్నవారికి సాయం అందిస్తున్నారు. రాశీఖన్నా చాలారోజుల నుంచి బీద మిరాకిల్ పేరుతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను కొద్ది రోజుల క్రితం వీడియో విడుదల చేశారు. కేవలం తను మాత్రమే చేస్తే కొద్దిమందికే సహాయం అందుతుందని అదే అనేకమంది కలిస్తే ఇంకా ఎక్కువమంది ఆకలి తీర్చవచ్చని తెలిపారు.. పేదవారి కోసం ప్రతి ఒక్కరు రూ.40 డోనేట్ చేస్తే వారికి ఒక పూట ఆకలి తీర్చినవారం అవుతామంటూ క్యాంపైనింగ్ మొదలుపెట్టారు. ఆమె పిలుపుతో అనేకమంది విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ డబ్బుతో హైదరాబాద్ సిటీలో ప్రతిరోజూ సుమారు 1200 మంది ఆకలిని తీరుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
ట్వీట్..
View this post on Instagram
Director Maruthi : మారుతి మంచి రోజులు వచ్చాయి కథ ఇదేనా.. ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త