Director Maruthi : మారుతి మంచి రోజులు వచ్చాయి కథ ఇదేనా.. ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త
సంతోష్ శోభన్‌కు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. నిన్న మొన్నటి వరకు హీరోగా గుర్తింపు దక్కించుకోవాలని తెగ ట్రై చేసిన సంతోష్ "ఏక్ మినీ కథ" సినిమా హిట్టుతో కాస్త కుదుట పడ్డారు.
Director Maruthi :
సంతోష్ శోభన్‌కు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. నిన్న మొన్నటి వరకు హీరోగా గుర్తింపు దక్కించుకోవాలని తెగ ట్రై చేసిన సంతోష్ “ఏక్ మినీ కథ” సినిమా హిట్టుతో కాస్త కుదుట పడ్డారు. ఇక ఏకంగా ఇప్పుడో క్రేజీ డైరెక్టర్ కళ్లలో పడి.. తాను కూడా క్రేజీ హీరోగా మారిపోనున్నారు. సంతోష్ శోభన్, మెహరీన్ హీరో హీరోయిన్‌లుగా స్టార్ డైరెక్టర్ మారుతి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా “మంచి రోజులు వచ్చాయి” అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.కొవిడ్ సమయంలో రెండు ఇళ్ల మధ్య జరిగే కథ ఇది. కరోనా వెళ్లిపోవడంతో సినిమా సుఖాంతమవుతుందని సమాచారం. అందుకే దీనికి తగ్గట్లుగానే “మంచి రోజులు వచ్చాయి” అనే పేరు ఎంచుకున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది.
రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయడమే లక్ష్యంగా డైరెక్టర్ మారుతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. జులై తొలి వారానికల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసి.. వీలైతే థియేటర్లలో లేదంటే ఓటీటీలో రిలీజ్ చేయాలని మారుతి అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాతో పాటే గోపీచంద్ హీరోగా “పక్కా కమర్షియల్” అనే చిత్రం సిద్ధం చేస్తున్నారు మారుతి.
మరిన్ని ఇక్కడ చదవండి :