అక్కడ వాళ్లు చెప్తేనే నటులను తీసుకుంటారు.. బాలీవుడ్ పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియమణి
ఇటీవలే ఆమె బాలీవుడ్ లోనూ నటించారు. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నటించింది ఈ చిన్నది. దాదాపు 21 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు ప్రియమణి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు ప్రియమణి. తాజాగా ప్రియమణి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నార్త్ , సౌత్ సినిమాలు రెండూ ఒకేలా ఉండవని అన్నారు ప్రియ.

అందం అభినయం కలబోసినా ముద్దుగుమ్మ ప్రియమణికి చాలా మంది అభిమానులున్నారు. హీరోయిన్ గా రాణించిన ప్రియమణి ఇప్పుడు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. ఇటీవలే ఆమె బాలీవుడ్ లోనూ నటించారు. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నటించింది ఈ చిన్నది. దాదాపు 21 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు ప్రియమణి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు ప్రియమణి. తాజాగా ప్రియమణి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నార్త్, సౌత్ సినిమాలు రెండూ ఒకేలా ఉండవని అన్నారు ప్రియ. అలాగే మన ఇండస్ట్రీ పై ప్రశంసలు కురిపించారు ప్రియమణి.
చాలా రోజుల నుంచి సౌత్ సినిమా, హిందీ సినిమా అనే చర్చ నడుస్తోంది. దీని గురించి చాలా మంది మాట్లాడారు. బాలీవుడ్ జనాలు మేం గ్రేట్ అంటారు, సౌత్ వాళ్ళు మేం గ్రేట్ అంటున్నారు. మరికొందరు రెండు పరిశ్రమలు ఒక్కటే అంటున్నారు. సౌత్, బాలీవుడ్‌లో పనిచేసిన అనుభవం ఉన్న ప్రియమణి దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రియమణి మాట్లాడుతూ..
బాలీవుడ్ లో ఆర్టిస్ట్ ల ఎంపిక డిఫరెంట్ గా ఉంటుంది. హిందీలో కాస్టింగ్ డైరెక్టర్ ఉంటాడు. అతను మిమ్మల్ని పిలుస్తారు. వారు ఓకే చేసిన తర్వాత టీమ్‌తో మాట్లాడుతారు. కానీ, మన దగ్గర అలా కాదు. అక్కడ మీకు నిర్మాత లేదా దర్శకుడి నుండి నేరుగా కాల్ వస్తుంది. బాలీవుడ్‌లో కాస్టింగ్ డైరెక్టర్ల నిర్ణయమే ఫైనల్’’ అని ప్రియమణి అన్నారు. బాలీవుడ్ లో ఒకొక్క దానికి ఒకొక్కరు ఉంటారు. కానీ సౌత్ సినిమాల్లో అలా కాదు.. సినిమా త్వరగా పూర్తి చేయాలి కాబట్టి అందరూ అన్ని పనులు చేస్తారు’ అన్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మెచ్చుకున్నాడు.
‘సౌత్‌లో చాలా మంది పురుషులు డ్రెస్, మేకప్ డిపార్ట్ మెంట్స్ లో పనిచేస్తున్నారు. వారు చేసే పనికి వారిని గౌరవించండి. నేను 2002లో సినిమాలు చేయడం మొదలు పెట్టా.., హీరోయిన్ తప్ప, సెట్‌లో అందరూ పురుషులే ఉంటారు. ఇప్పుడు అంతా మారుతోంది’ అని ఆమె అన్నారు. 2003లో విడుదలైన ‘ఎవరే అతగాడు’ అనే సినిమాతో ప్రియమణి తన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గతేడాది విడుదలైన ‘జవాన్’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నారు ప్రియమణి.
ప్రియమణి ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
