Ishwarya : హీరోయిన్‌గా జబర్దస్త్ బ్యూటీ ఐశ్వర్య.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్త్ నుంచి చాలా మంది సినిమాల్లోకి వచ్చారు. కమెడియన్స్ గా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే యాంకర్ రష్మీ కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు జబర్దస్త్ నుంచి ఓ నటి హీరోయిన్ గా మారింది. ఆమె పేరే ఐశ్వర్య.
బుల్లి తెరనుంచి చాలా మంది వెండి తెరపై కూడా మెరిశారు. టీవీ సీరియల్స్ లో నటించిన చాలా మంది సినిమాల్లోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే టీవీ షోలు చేసే వారుకూడా సినిమాల్లో తమ సత్తా చాటారు.. ఇక ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్త్ నుంచి చాలా మంది సినిమాల్లోకి వచ్చారు. కమెడియన్స్ గా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే యాంకర్ రష్మీ కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు జబర్దస్త్ నుంచి ఓ నటి హీరోయిన్ గా మారింది. ఆమె పేరే ఐశ్వర్య. జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ లో కనిపించి మెప్పించింది ఈ అమ్మడు. చూడచక్కని రూపంతో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది ఈ బ్యూటీ.
ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా మారిపోయింది. ఐశ్వర్య హీరోయిన్ గా, పార్వతీశం హీరోగా తెరకెక్కుతోన్న సినిమా మెర్సీ కిల్లింగ్. ఈ సినిమా ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఐశ్వర్య తన నటనతో ఆకట్టుకోనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.
జబర్దస్త్ లో తన అందంతో.. క్యూట్ నెస్ తో ఆకట్టుకున్న ఐశ్వర్యకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఈ సినిమా తర్వాత ఐశ్వర్యకు సినిమా అవకాశాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఈ మూవీలో సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. అలాగే సూర్య భగవాన్ దాస్, ఆనంద్ చక్రపాణి, రామరాజు కీ రోల్స్ ప్లే చేశారు. ఆర్టికల్ 21ని ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.
View this post on Instagram
ఐశ్వర్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.