Dhanush: పిల్లలు నాకే కావాలి.. ధనుష్‌కు షాక్ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్..

ధనుష్, ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈలోగా పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తింది. దాదాపు 18 ఏళ్లకు పైగా కలిసున్న ఈజంట ఉన్నట్టుండి సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ధనుష్ , ఐశ్వర్య విడిపోతున్నారంటే చాలా మంది నమ్మలేకపోయారు.

Dhanush: పిల్లలు నాకే కావాలి.. ధనుష్‌కు షాక్ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్..
Danush
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 11, 2024 | 7:57 AM

స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ గురించి రోజుకొక వార్త వినిపిస్తుంది. ఈ జంట రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. తాజాగా ధనుష్, ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈలోగా పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తింది. దాదాపు 18 ఏళ్లకు పైగా కలిసున్న ఈజంట ఉన్నట్టుండి సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ధనుష్ , ఐశ్వర్య విడిపోతున్నారంటే చాలా మంది నమ్మలేకపోయారు. విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత ఇద్దరు బిజీగా మారిపోయారు. హీరోగా ధనుష్ సినిమాలు చేస్తుంటే.. ఐశ్వర్య దర్శకురాలిగా సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు పిల్లల బాధ్యత గురించి ఆసక్తికర విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

పిల్లల బాధ్యతను ఐశ్వర్య పంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. పిల్లలను పోషించే బాధ్యత తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఐశ్వర్య. పిల్లా బాధ్యత పై ఇద్దరూ ఓ క్లారిటీ తో ఉన్నారట. ఈ క్రమంలోనే ఐశ్వర్య తనకు పిల్లల బాధ్యతను అప్పగించాలని కోరింది. దానికి ధనుష్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదట.

ఐశ్వర్య రజనీకాంత్ చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఐశ్వర్య తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘3’లో ధనుష్ హీరోగా నటించాడు. ఈ దంపతులకు యాత్ర, లింగ అనే పిల్లలు ఉన్నారు. మొదటి కొడుకు యాత్రకు 18 ఏళ్లు. మరో కొడుకు లింగాకి 14 ఏళ్లు. ధనుష్, ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ధనుష్, ఐశ్వర్య విడిపోవడానికి కారణం ఇంకా వెల్లడించలేదు. ఐశ్వర్య సినిమా డైరెక్షన్‌లో బిజీగా ఉంది. నటుడు ధనుష్ వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ్ , హిందీ బాషాలతో పాటు హాలీవుడ్ లోనూ నటించారు ధనుష్. ఇక ఐశ్వర్య ఇటీవలే తన తండ్రి రజినీకాంత్ తో లాల్ సలామ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.