NTR : ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వైరల్‌గా మారిన వీడియో..

మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. తారక్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోయింది. విదేశాల్లోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

NTR : ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వైరల్‌గా మారిన వీడియో..
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 11, 2024 | 7:18 AM

ఎన్టీఆర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి.. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు తారక్. మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. తారక్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోయింది. విదేశాల్లోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బడా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు తారక్.

రీసెంట్ గా ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఎన్టీఆర్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు. అయితే తారక్ కు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియో లో ఎన్టీఆర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరల్ గా మారిన ఈ వీడియోలో అభిమానులు కాస్త అత్యుత్సహం చూపించారు.

టిల్లు స్క్వేర్ ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ తిరిగి కారు దగ్గరకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఎగబడ్డారు. తారక్ ను చూడాలని ముట్టుకోవాలని ఫ్యాన్స్ ఎగబడ్డారు. అక్కడున్న బౌన్సర్లు కూడా.. ఫ్యాన్స్ ను ఆపలేకపోయారు. ఒక్కసారిగా ఫ్యాన్స్ తారకు ను తోసేశారు. ఎన్టీఆర్ ను కదలనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇంతలో ఓ అభిమాని బౌన్సర్లను దాటుకొని తారక్ దగ్గరకు చేరుకొని కాళ్ల మీద పడబోయాడు. దాంతో తారక్ కింద పడబోయాడు. వెంటనే బౌన్సర్లు తారక్ ను గట్టిగా పడకుండా పట్టుకున్నారు. ఫ్యాన్స్ ఇబ్బందిపెడుతున్నా.. తారక్ చాలా ఓపికగా.. సహనంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.