మొత్తం పోగొట్టుకొని భికారి అయిపోయా..! నా అనుకున్నవాళ్లే మోసం చేశారు..!! ఎమోషనల్ అయిన రఘు
చాలా సినిమాల్లో కమెడియన్ గా రాణించారు నటుడు రోలర్ రఘు. పలు సినిమాల్లో కమెడియన్ గా నటించి అలరించారు రఘు. వరుసగా సినిమాలు చేసిన రఘు ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. సినిమాలతో పాటు జబర్దస్త్ లో కామెడీ చేసి మెప్పించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రఘు తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

జబర్దస్త్ నటుడు రోలర్ రఘు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించాడు. కామెడీ విలన్ గా నవ్వులు పూయించాడు రోలర్ రఘు. అలాగే జబర్దస్త్ లోనూ పలు స్కిట్స్ తో ప్రేక్షకులకు నవ్వులు పంచాడు. ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న రఘు ఈ మధ్య సినిమాలు తగ్గించారు. జబర్దస్త్ నుంచి కూడా బయటకు వచ్చేశారు. కాగా ఓ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఆప్తుల నుండి ఎదురైన మోసాలు, అలాగే కష్టకాలంలో ఆయనకు లభించిన కుటుంబ మద్దతు ఇలా అనేక విషయాలను పంచుకున్నారు.
రఘు మాట్లాడుతూ, తన జీవితంలో ఆర్థికంగా బాగా దెబ్బతిన్నానని, తెలిసిన వారు, నమ్మిన వ్యక్తులు మోసం చేశారని తెలిపారు. అలాగే షేర్ మార్కెట్‌లో నష్టపోవడం వంటి కారణాల వల్ల ఒకానొక దశలో రోడ్డున పడినట్లు అనిపించిందని రఘు అన్నారు. ఆ కష్టసమయంలో తాను మూడు నెలల పాటు ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని, ఈ దెబ్బలు తట్టుకోవడం చాలా కష్టమైందని అన్నారు. ఒకేసారి అన్ని దెబ్బల మీద దెబ్బ పడటంతో భికారి అయిపోయాను అని అన్నారు రఘు.
అయితే, ఈ కష్టకాలంలో తన భార్య తన వెన్నెముకగా నిలిచిందని, ఆమె ప్రోత్సాహంతోనే తాను తిరిగి కోలుకోగలిగానని రఘు అన్నారు. పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకుందాం.. అని ఆమె ఇచ్చిన ధైర్యం తనను ముందుకు నడిపిందని తెలిపారు. తన పిల్లల భవిష్యత్తు కోసం, వారు ఎదిగేలోపు తాను ఏదో ఒకటి సాధించాలనే సంకల్పంతోనే తాను పోరాడానని వివరించారు. ప్రస్తుతం తాను డబ్బు, మనశ్శాంతి, కుటుంబం, పది మంది మంచి స్నేహితులతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




