Poonam Kaur: “బికినీలో తిరుగుతా నా ఇష్టం”.. ఘాటుగా స్పందించిన పూనమ్ కౌర్
ఒకానొక టైం లో హీరోయిన్ గా రాణించిన బ్యూటీస్ లో పూనమ్ కౌర్ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది ఈ చిన్నది.
ఒకానొక టైంలో హీరోయిన్ గా రాణించిన బ్యూటీస్ లో పూనమ్ కౌర్(Poonam Kaur) ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. హీరోయిన్ గా పలు సినిమాల్లో కనిపించిన పూనమ్ ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్స్ లోనూ మెరిసింది. తెలుగులో చివరిగా నాయకి సినిమాలో కనిపించింది పూనమ్ కౌర్. ఇక ఈ అమ్మడు సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం రకరకాల ఫొటోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది . అలాగే హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపుతోంది పూనమ్. కొన్ని సార్లు ఈ అమ్మడు చేసే వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తుంటాయి కూడా..
గతంలో ఈ చిన్నది స్టార్ హీరోల ఫ్యాన్స్ నుంచి వార్నింగ్స్ కూడా ఎదురుకుంది పూనమ్. ఇక తాజాగా మహిళల డ్రసింగ్ గురించి అసభ్యకరంగా మాట్లాడే వారి గురించి మండిపడింది. సోషల్ మీడియా వేదికగా ఆడవాళ్ళ డ్రసింగ్ పై కామెంట్ చేసే వారికీ గట్టి వార్నింగ్ ఇచ్చింది పూనమ్. ఆడవాళ్లు వేసుకునే డ్రస్సులు కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయని కొంతమంది అంటూ ఉంటారు. ముందుగా ఈ విషయం గురించి మాట్లాడేవారు నిండుగా దుస్తులు ధరించిన మహిళలపైనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించాలి. నేను కూడా నాకు నచ్చిన విధంగా నాకు కంఫర్ట్ గా ఉండే దుస్తులను ధరిస్తాను. నేను బురుఖ వేసుకుంటాను, చీర కట్టుకుంటాను అలాగే బీచ్ కి వెళ్తే బికినీ వేసుకొని తిరుగుతాను. మీకు లిమిట్స్ క్రాస్ చేస్తే హక్కు లేదు… నాకు నచ్చిన, నాకు కంఫర్ట్ గా ఉన్న బట్టలే వేసుకుంటా..అంటూ ఘాటుగా స్పందించింది పూనమ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి