AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayaprada: వెండితెరపై వెన్నెల సంతకం..భారతీయ స్త్రీ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం..అచ్చ తెలుగమ్మాయి జయప్రద పుట్టిన రోజు నేడు..

Jayaprada Birth Day: ఆమెది కళ్ళు చెదిరి అందం... ఆకట్టుకునే అభినయం.. హృదయాన్ని దోచుకునే నవ్వు.. చీరకే అందాన్ని తెచ్చిన ముగ్ధ సోయగం.. లక్షలాది ప్రేక్షకుల మనసును కొల్లగొట్టిన వెండితెరపై వెన్నెల సంతకం...

Jayaprada: వెండితెరపై వెన్నెల సంతకం..భారతీయ స్త్రీ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం..అచ్చ తెలుగమ్మాయి జయప్రద పుట్టిన రోజు నేడు..
Jayaprada Birth Day
Surya Kala
| Edited By: Rajeev Rayala|

Updated on: Apr 03, 2022 | 2:45 PM

Share

Jayaprada Birth Day: ఆమెది కళ్ళు చెదిరి అందం.. ఆకట్టుకునే అభినయం.. హృదయాన్ని దోచుకునే నవ్వు.. చీరకే అందాన్ని తెచ్చిన ముగ్ధ సోయగం.. లక్షలాది ప్రేక్షకుల మనసును కొల్లగొట్టిన వెండితెరపై వెన్నెల సంతకం.. గ్లామర్‌, ప్రతిభ… ఎటువంటి క్యారెక్టర్ లో నైనా పాత్రలో ఒదిగిపోయి నటించే దర్శకులు చెక్కిన నటి.. తూర్పుగోదావరి( East Godavri) లోని ఓ పట్టణంలో పుట్టి.. దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న అచ్చ తెలుగమ్మాయి జయప్రద. భారతీయ స్త్రీ(Indian Woman) సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం జయప్రద అంటూ లెజెండ్రీ దర్శకుడు సత్యజిత్ రే(Satyajit Ray) తో ప్రశంసలను అందుకున్న జయప్రద (లలితకుమారి) పుట్టిన రోజు నేడు..

భారత సినీ వినీలాకాశంలో జయప్రద ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. సహజమైన సౌందర్యానికి సరిహద్దులా అనిపించే జయప్రద అసలు పేరు లలితారాణి. రవణం కృష్ణారావు, నీలవేణి దంపతులకు 1959 ఏప్రిల్ 3 న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. చిన్నతనం నుంచే జయప్రద నాట్యంలో శిక్షణ పొందారు. అయితే ఆమె సినీ ప్రయాణం కూడా గోదావరి పరవళ్ళను ప్రయాణాన్ని తలపించడం యాదృచ్చికం. గడసరి,సొగసరి, అద్భుతమైన నాయిక.. దర్శక నిర్మాతలు కోరుకునే ఆర్టిస్టు జయప్రద. రాజమండ్రి నుంచి చెన్నై అక్కడ నుంచి బాలీవుడ్‌ వరకూ ఎదిగిన సౌందర్యం జయప్రద. తండ్రి కృష్ణారావు ఫిలిం ఫైనాన్సర్‌, బాబాయిలు సినిమాలకు పంపిణీదారులు. ఆయితే జయప్రద ఎప్పుడూ సినిమాల్లో నటించాలని అనుకోలేదు. అయితే స్కూల్‌ వార్షికోత్సవంలో లలిత రాణి నృత్య ప్రదర్శన ఇచ్చింది. దీంతో నటుడు ప్రభాకర రెడ్డి ‘భూమి కోసం’ చిత్రంలో ఓ పాటలో డ్యాన్స్ చేసే అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంతో లలితా రాణి జయప్రదగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ పాటలో నాట్యం చేసినందుకు రూ. 10లు పారితోషకాన్ని అందుకుంది. అనంతరం 976లో 17 సంవత్సరాల వయస్సులో తినడానికి కూడా క్షణం లేని తారాలా ఎదిగారు.

బాలచందర్ దర్శకత్వంలో చేసిన ‘అంతులేని కథ’, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన ‘సిరిసిరి మువ్వ’ వంటి చిత్రాలు ఆమె సినీ జీవితానికి రెడ్ కార్పెట్ పరచి, స్వాగతం పలికాయి. అనంతరం ఆమె తెలుగు కమర్షియల్ సినిమాకు చిరునామా మారారు. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘సీతా కళ్యాణం’లో జయప్రద నట వైవిధ్యానికి అద్దం పడుతుంది. టాలీవుడ్, తమిళంలో అనేక సినిమాల్లో నటిస్తున్న జయప్రద 1979లో ‘సర్గం’ చిత్రం హిందీతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ చిత్రం తెలుగు ‘సిరి సిరి మువ్వ’కు అనువాదం. అదే సంవత్సరం కన్నడలో ‘హులియా హాలీనా మేవు’, తమిళంలో ‘నిన్నయ్‌ తలి ఇనుక్కుం’ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇలా ఎన్నో చిత్రాల్లో జయప్రద నటించి సినీ ప్రియుల్ని రంజింప చేసారు.

జయప్రద అప్పటి స్టార్ హీరోలందరి తొనూ జోడీ నటించారు ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. 1990 లలో జయప్రద పూర్తిగా బాలీవుడ్ పై దృష్టి సారించింది. దీంతో తెలుగు తెరపై అప్పుడప్పుడు మాత్రమే కనిపించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ ఇలా ఏడు భాషల్లో జయప్రద సుమారు 300 చిత్రాలకి పైగా నటించారు. అందం అవకాశాలను తెచ్చి పెడితే …అభినయం అవార్డ్ లను తెచ్చి పెడుతుందనే మాట జయప్రద విషయంలోనూ నిజమైంది ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలిం ఫేర్‌ సౌత్‌ స్పెషల్‌ , ఫిలిం ఫేర్‌ ఉత్తమ నటి, ఫిలిం ఫేర్‌ సౌత్‌ జీవన సాఫల్య పురస్కారం సహా కళాశ్రీ, కళా సరస్వతి, కిన్నెర సావిత్రి అవార్డులను జయప్రద తీసుకున్నారు. రాజీవ్‌ గాంధీ అవార్డు, నర్గీస్‌ దత్‌ గోల్డ్‌ మెడల్, శకుంతల కళా రత్నం వంటి అనేక అవార్డులు అందుకున్నారు. వివిధ సాంస్కృతిక సంస్థల నుంచి అందుకున్న అవార్డులు లెక్క లేవు. ఉత్తమ్‌ కుమార్‌ అవార్డు, ఏఎన్నార్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డ్, టీఎస్సార్, టీవీ 9 సంస్థల నుంచి వీనస్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా వంటి అవార్డులు ఆమె అభినయానికి కొలమానాలుగా నిలిచాయి. నటిగా ఆమె వెండితెరకి దక్కిన పుణ్య ఫలం. ఓ వైపు నటిస్తూనే మరో వైపు రాజకీయాల్లో అడుగు పెట్టారు. దివంగత ఎన్టీఆర్‌ పిలుపు మేరకు మొదట తెలుగు దేశం పార్టీలో రాజకీయాల్లో అడుగు పెట్టారు. లోక్ సభ ఎంపీగా జయప్రద ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నుంచి ఎంపికయ్యారు.

Also Read: Hyderabad: ‘పబ్‌లో నేను లేను.. నన్నెందుకు బద్నాం చేస్తున్నారు’.. హేమ సూటి ప్రశ్న

Sun Rays in Temple: సైన్స్‌కు సవాల్.. ఆ ఆలయంలో ఉగాది రోజున సంధ్య వేళ స్వామివారిని అభిషేకించే సూర్యకిరణాలు

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ