Vikrant Rona : మెగాస్టార్ చేతుల మీదుగా కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ’ టీజర్..
శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్(Kichcha Sudeep) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు సుదీప్.

శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్(Kichcha Sudeep) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు సుదీప్. ఈ సినిమాతో తెలుగు సుదీప్ కు మంచి క్రేజ్ ఏర్పడింది.. దాంతో ఆయన నటించిన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అయ్యి విజయాలను అందుకుంటున్నాయి. తాజాగా సుదీప్ ఓ భారీ బడ్జెట్ త్రీడీ మూవీలో నటిస్తున్నాడు. `విక్రాంత్ రోణ`(Vikrant Rona) అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ’ చిత్రాన్ని అనుప్ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
ఈ చిత్రంతో విక్రాంత్ రోణ అనే కొత్త సూపర్ హీరో పరిచయమవుతున్నాడు. సినీ పరిశ్రమలో నటుడిగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సుదీప్ నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్‌గా కిచ్చా సుదీప్ సినీ జర్నీకి సంబంధించిన స్నీక్ పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. విక్రాంత్ రోణలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ సహా నిరూప్ భండారి, నీతా అశోక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కిచ్చా సుదీప్ స్టార్ పవర్‌తో ప్రేక్షకులను థియేటర్స్‌కు భారీగా రప్పిస్తుందని మేకర్స్ అంటున్నారు. బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు.
This looks Superb! @KicchaSudeep ‘s adventure-thriller release date teaser లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. Director @anupsbhandari & entire team, BEST WISHES!#VikrantRonaJuly28 worldwide release in 3D @nirupbhandari @neethaofficial @Asli_Jacqueline @shaliniartss @ZeeStudios_ pic.twitter.com/L6affNJf14
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :
