Nivetha Pethuraj: అలా మొదలైంది.. దుబాయ్ బిజినెస్‌మెన్‌తో లవ్ స్టోరీని బయట పెట్టిన హీరోయిన్ నివేద
టాలీవుడ్ హీరోయిన్ నివేద పేతురాజ్ ఇటీవల తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది. సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసింది. మరి వీరి ప్రేమ కథ ఎలా మొదలైంది? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? తదితర విషయాలను అందరితో పంచుకుంది నివేద.

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తన ప్రియుడిని పరిచయం చేసింది టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా పేతురాజ్. దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నానన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అసలు జిబ్రాన్ తో పరిచయం ఎప్పుడు మొదలైంది? ప్రేమ దాకా ఎలా వెళ్లింది? పెళ్లెప్పుడు చేసుకుంటారన్న విషయాలను లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది నివేద. ‘ఐదేళ్ల క్రితం దుబాయిలో ఓ రేసింగ్ సందర్భంగా రజిత్‌తో మొదటి సారి నాకు పరిచయం జరిగింది. మొదట మంచి స్నేహితులుగానే ఉన్నాం. ఆ తరవాత ఇద్దరి అభిప్రాయాలు, మనసులు కలవడంతో ఇద్దరు ప్రేమికులమయ్యాం. మా సర్కిల్ లో చాలా తక్కువ మందికి మాత్రమే మా ప్రేమ విషయం తెలుసు. సినిమా ఇండస్ట్రీలోనూ ఎవరికీ ఈ విషయం తెలియదు. సడెన్ గా మా ప్రేమ విషయం బయట పెట్టడంతో నా మేనేజర్ తో సహా అందరూ షాక్ అ య్యారు.’
‘ రజిత్‌తో అక్టోబర్ లో నా ఎంగేజ్ మెంట్ ఉండనుంది. ఆ తర్వాత జనవరిలో పెళ్లి ఉండనుంది. అయితే డేట్ ఇంకా ఫైనలేజ్ చేయలేదు. కానీ ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేశాం. ప్రస్తుతం మా ఇద్దరి కుటుంబాలు దుబాయ్ లో ఉన్నాయి. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సింపుల్ గానే మా పెళ్లి వేడుకను చేసుకుంటాం’ అని నివేద చెప్పుకొచ్చింది.
రజిత్ తో నివేదా పేతురాజ్..
View this post on Instagram
మధురైలో పుట్టి పెరిగిన నివేదా పేతురాజ్ .. ‘మెంటల్ మదిలో’ అనే మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం, దాస్ కా దమ్కీ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. అలాగే కార్ రేసింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లోనూ సత్తా చాటింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి సినిమాలు లేవని తెలుస్తోంది.
నివేద పేతురాజ్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







