Mrunal Thakur: ఏడు నెలల క్రితమే బ్రేకప్.. లవ్ స్టోరీ బయటపెట్టిన మృణాల్ ఠాకూర్..

ఈ సినిమా తర్వాత పూర్తిగా తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. ఇప్పుడు హిందీలో వరుస ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది మృణాల్. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ తన లవ్, బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. తనకు ఏడు నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని.. అయినా పెద్దగా బాధపడట్లేదని తెలిపింది.

Mrunal Thakur: ఏడు నెలల క్రితమే బ్రేకప్.. లవ్ స్టోరీ బయటపెట్టిన మృణాల్ ఠాకూర్..
Mrunal Thakur
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2024 | 8:30 PM

సీతారామం సినిమాతో టాలీవుడ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది మృణాల్ ఠాకూర్. అప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రైక్ కోసం వెయిట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఫస్ట్ మూవీతోనే సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్ వచ్చేసింది. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత నాని సరసన హాయ్ నాన్న మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. చివరగా విజయ్ దేవరకొండ జోడిగా ఫ్యామిలీ స్టార్ మూవీలోనూ మెరిసింది. ఈ సినిమా తర్వాత పూర్తిగా తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. ఇప్పుడు హిందీలో వరుస ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది మృణాల్. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ తన లవ్, బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. తనకు ఏడు నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని.. అయినా పెద్దగా బాధపడట్లేదని తెలిపింది.

“మనకు సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చేవరకు చాలా మంది వెళ్లిపోయే వాళ్లు వస్తూ వెళ్తూ ఉంటారు. కానీ మనకు ఎవరు సెట్ అవుతారనేది మనకు మాత్రమే తెలుస్తోంది. నా జీవితంలో ఓ వ్యక్తిని ప్రేమించాను. కానీ అతడితో రిలేషన్ షిప్ నచ్చలేదు. పద్దతిగల కుటుంబం నుంచి వచ్చానని.. ఒక నటితో రిలేషన్ షిప్ అంటే ఆలోచించాలి అన్నాడు. దాంతో ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం. ఏడు నెలల క్రితం కూడా నాకు బ్రేకప్ జరిగింది. నా జీవితంలోకి వచ్చే వ్యక్తికి లుక్స్ లేకపోయినా పర్వాలేదు. కానీ మంచి మనసు ఉండాలి. ఇప్పటివరకు లైఫ్ లో ఎన్నో బ్రేకప్స్ జరిగాయి. కానీ మరీ అంతగా బాధపడలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది మృణాల్. తాజాగా క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా సైమా 2024 అవార్డును అందుకుంది. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్ చిత్రాలపైనే పెట్టింది. హిందీలో తనకు అందమైన లవ్ స్టోరీస్ రావడం లేదని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.