AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెండి బంగారం ధరలపై గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వెండి బంగారం ధరలపై గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

Phani CH
|

Updated on: Jan 21, 2026 | 12:57 PM

Share

బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా వెండి, అనూహ్యంగా దూసుకుపోయి కిలో 3 లక్షలు దాటి రికార్డు స్థాయికి చేరింది. డాలర్ బలహీనపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వెండి పారిశ్రామిక వినియోగం పెరగడం, ETFలలో పెట్టుబడులు వంటివి ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ధోరణి కొనుగోలుదారులకు భారంగా మారింది.

బంగారానికి బ్రేకుల్లేవు… సిల్వర్‌కు రెడ్‌ సిగ్నల్స్‌ లేవు. తగ్గేదే లేదంటున్నాయి రెండు మెటల్స్‌ ధరలు. గోల్డ్ అండ్‌ సిల్వర్‌….న్యూ ఇయర్‌లో ఆల్‌ టైమ్‌ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. పసిడిని మించి పరుగులు పెడుతోంది సిల్వర్‌. కిలో వెండి ధర మళ్లీ పెరిగి ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ఇక బంగారాన్ని కొనలేం. ఈ విషయం మనకు తెలిసి చాలా కాలమైంది. గోల్డ్‌ కాకున్నా, సిల్వర్‌ కొని సరిపెట్టుకుందామని అనుకున్నా, అదీ కుదరడం లేదు. ఎందుకంటే, సిల్వర్‌ కూడా మనకు అందనంత ఎత్తులోకి వెళ్లిపోయింది. జనవరి 1న కిలో వెండి రేటు రూ. 2,56,000 ఉంటే…జనవరి 19నాటికి 3 లక్షల 14వేల రూపాయలకు చేరింది. అంటే జనవరి 1 నుంచి ఇప్పటిదాకా సిల్వర్‌ రేట్లు 24.22 శాతం పెరిగాయి. కేవలం 19 రోజుల్లోనే వెండి ధరలు ఇలా పెరగడం జనాన్ని బెంబేలెత్తిస్తోంది. అయితే సిల్వర్‌ రేట్లు, ఇలా రాకెట్‌లా దూసుకుపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించే చాన్స్‌ ఉండడం ఒక కారణం. ఇక గ్రీన్‌ ల్యాండ్‌ విషయంలో యూరోపియన్‌ యూనియన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగడం మరో కారణమని చెబుతున్నారు విశ్లేషకులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ సుంకాల పోరు బులియన్‌ మార్కెట్‌ను చుక్కలంటేలా చేస్తోంది. ట్రంప్‌ హెచ్చరికలతో స్పాట్‌, ఫ్యూచర్స్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరో ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరాయి. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 గ్యారెట్స్‌ 10 గ్రాముల మేలిమి బంగారం ఒకే రోజు రూ.1,900 పెరిగి రూ.1,48,100కు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.10,000 పెరుగుదలతో జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.3,02,600కి చేరింది. ఇక పారిశ్రామికంగా వెండి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సెమీకండక్టర్స్‌, సోలార్‌ ప్యానెల్స్‌, ఎలక్ట్రిక్ వెహికల్స్ విడి విభాగాల్లో వెండి వినియోగం తారస్థాయికి చేరింది. మరోవైపు వెండి లభ్యత నానాటికి తగ్గిపోతోంది. ఇంకో వైపు సిల్వర్ ETFలలో పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంతో సిల్వర్‌ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయంటున్నారు అనలిస్టులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

Vande Bharat: వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??