చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి చంటిబిడ్డతో కదులుతున్న కాశీ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోయి ప్రమాదానికి గురయ్యాడు. పట్టుతప్పి వేలాడుతుండగా, అప్రమత్తంగా ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించి అతడిని, బిడ్డను రక్షించారు. ఈ సంఘటన కదులుతున్న రైళ్లు ఎక్కడం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించింది. రైల్వే శాఖ ప్రయాణికులను భద్రతా నిబంధనలు పాటించాలని హెచ్చరించింది.
కదలుతున్న రైల్లోకి ఎక్కే ప్రయత్నం చేయొద్దని రైల్వే శాఖ ఎంతగా చెబుతున్నా ప్రయాణికుల్లో మాత్రం ఆశించిన మార్పు రావడం లేదు. ఓ వ్యక్తి ఏకంగా చంటిబిడ్డను ఎత్తుకుని కదిలే రైలు ఎక్కబోయి చిక్కుల్లో పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. కాశీ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతున్న సమయంలో ఓ వ్యక్తి తన చంటి బిడ్డతో రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఎలాగైనా రైలు ఎక్కాలన్న తొందరలో ఆ వ్యక్తి తన బిడ్డను చేజేతులా రిస్క్‌లోకి నెడుతున్న విషయాన్నీ గమనించలేదు. పరుగుపరుగున వెళ్లి రైలు మెట్లపై కాలుపెట్టాక పట్టు తప్పి కిందకుజారాడు. బోగీ డోర్ పక్కన ఉన్న రాడ్ పట్టుకుని వేలాడుతూ నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అతడి చేతిలోని బిడ్డను రైల్లోని మరో ప్యాసింజర్ పట్టుకున్నాడు. అప్పటికే ఇదంతా గమనిస్తున్న ఆర్‌పీఎఫ్ సిబ్బంది సెకెన్ల వ్యవధిలో స్పందించి ఆ వ్యక్తిని కాపాడారు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆ వ్యక్తికి, అతడి బిడ్డకు ఎలాంటి గాయాలూ కాలేదని ఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. తన బిడ్డతో కలిసి అతడు మరో రైల్లో వెళ్లిపోయాడని చెప్పారు. అప్రమత్తంగా వ్యవహరించి ముప్పును తప్పించిన ఆర్‌పీఎఫ్ సిబ్బందిని రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసించారు. కదులుతున్న రైళ్లల్లోకి ఎక్కే ప్రయత్నం చేయొద్దని ప్రయాణికులను మరోమారు హెచ్చరించారు. రైలు ఆగి ఉన్న సమయంలోనే ఎక్కాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఇక వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. చిన్నారులతో ప్రయాణించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Medaram Jathara: వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
KA Paul: ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
గ్రీన్‌లాండ్ కు సైనిక బలగాల తరలింపు
Gold Price Today: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధర.. మంగళవారం ఎంత పెరిగిందంటే
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్ రిపోర్ట్
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

