Instant Loan Apps: 5 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ లోన్ నిజమేనా..? లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారు ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోవడం ఫిక్స్..
కేవలం 5 నిమిషాల్లో ఇన్‌స్టంట్ లోన్ పొందండి అంటూ మీరు లోన్ యాప్స్ నుంచి మెస్సేజ్‌లు పొంది ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ తీసుకున్నారని మీరు కూడా తీసుకోవాలని చూస్తున్నారా..? అయితే మీ అలర్ట్.. నమ్మకమైన యాప్స్ నుంచి మాత్రమే లోన్ పొందండి. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

“కేవలం 5 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ లోన్ పొందండి. ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా లోన్ అందిస్తాం. కేవలం నిమిషాల వ్యవధిలోనే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తాం.. ఎలాంటి హామీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు.. వెంటనే అలర్ట్ అవ్వండి” అంటూ మీ మొబైల్‌కు మెస్సేజ్‌లు లేదా ఈమెయిల్స్‌కు ప్రకటనలు రావడం అందరికీ తెలిసే ఉంటుంది. మరి కొన్ని లోన్ యాప్‌లు వాట్సప్‌లో మార్కెటింగ్ ప్రకటనలు పంపడం, కాల్స్ చేసి లోన్ కావాలా అంటూ అడగడం చేస్తూ ఉంటాయి. అత్యవసరమైన సమయంలో కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో లోన్ యాప్స్‌లను ఆశ్రయించారు. లోన్ యాప్స్ నుంచి ఇన్‌స్టంట్ లోన్లు తీసుకుంటున్నారు. అధిక వడ్డీ ఉన్నా అవసరం కావడంతో తీసుకుంటున్నారు.
ఈ సంస్థలను మాత్రమే నమ్మండి
ఏదైనా సంస్థ భారత్‌లో ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాతనే లోన్లు ఇవ్వడం లాంటి పనులు చేయాలి. బ్యాంకులు కూడా ఇటీవల ఇన్‌స్టంట్ లోన్లు ఆఫర్ చేస్తుండగా.. వీటికి పోటీగా బ్యాంకింగ్ యేతర ఎన్‌ఎఫ్‌బీసీ కంపెనీలు కూడా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఆర్బీఐ ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులు, ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థల యాప్‌ల నుంచి ఇన్‌స్టంట్ లోన్లు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చట్టవిరుద్దంగా, ఆర్బీఐ అనుమతి లేకుండా కొన్ని యాప్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లు పూర్తిగా మోసపూరితమైనవి. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని ఇలాంటి యాప్‌ల్లో అసలు లోన్లు తీసుకోవద్దు.
వీటిని చెక్ చేసుకోండి
-ఆర్బీఐ నుంచి అనుమతి ఉందా.. లేదా అనేది చెక్ చేసుకోండి -వడ్డీ రేట్లు తనిఖీ చేయండి.. -రేటింగ్స్, రివ్యూలను చూసుకోండి -మీరు లోన్ తీసుకునే సమయంలో ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పిస్తున్నారు అనే విషయాలను గమనించుకోండి -అనవసరమైన అనుమతులు ఏమైనా ఇస్తున్నారా అనే దానిపై జాగ్రత్తగా వ్యవహరించండి -నమ్మకైన తిరిగి చెల్లింపు ప్రక్రియలను ఎంచుకోండి
లోన్ కోసం ఏం అవసరం
సాధారణంగా లోన్ కోసం పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, లైవ్ సెల్పీ, ఫొటో, శాలరీ స్లిప్పులు, బ్యాంక్ స్టేట్ మెంట్, కేవైసీ ధృవీకరణ అవసరం. కానీ కొన్ని యాప్స్ ఫోన్ కాంటాక్ట్స్, ఫొటోలు, ఫొన్ కాల్స్, లొకేషన్ యాక్సెస్ చేయడానికి యాప్స్‌లో అనుమతులు కోరుతున్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నాయి. ఇలాంటి యాప్స్‌ను అసలు నమ్మకండి. అనధికార యాప్స్ మాత్రమే వీటిని అడుగుతున్నాయి. అధికారిక యాప్స్ వీటిని అడగవు. ఈ విషయాన్ని గుర్తించి నమ్మకమైన యాప్స్ నుంచి మాత్రమే రుణం పొందండి.
