Central Government: దేశ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. ప్రతీ నెలా రూ.5 వేలు పెన్షన్.. మరో 5 ఏళ్ల పాటు..
దేశ ప్రజలకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటల్ పెన్షన్ యోజన పథకం పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో చేరినవారికి 60 ఏళ్ల తర్వాత నెలనెలా పెన్షన్ రానుంది. ఈ పథకం వివరాలు ఇలా..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలు ఉపయోగపడేలా మరో నిర్ణయం తీసుకుంది. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరోసారి పొడిగించింది. 2030-31వ ఆర్ధిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2026 జనవరి 19 నాటికి దాదాపు ఈ స్కీమ్‌లో 8.86 కోట్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఈ పధకం ప్రయోజనాలు ఉపయోగించుకునేలా మరింతగా ప్రచారం నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునినచ్చారు. అసలు ఈ పథకం ప్రయోజనాలు ఏంటి..? పెన్షన్ ఎంత వస్తుంది..? అనే విషయాలు చూద్దాం.
అర్హతలు ఇవే..
-18 నుంచి 40 ఏళ్ల సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు -60 ఏళ్లు దాటాక పెన్షన్ పొందే అవకాశం -నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ -వయస్సు, నెల నెలా ఎంత పెన్షన్ పొందాలనుకుంటున్నారనే విషయాన్ని బట్టి ప్రీమియం -నెలనెలా లేదా వార్షిక ప్రీమియం చెల్లించవచ్చు -2015లో పథకం ప్రారంభం -పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ ఆధ్వర్యంలో పథకం -బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి -బ్యాంకులు లేదా పోస్టాఫీస్‌ల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు
అనర్హులు వీళ్లే
-ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు -నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు -40 ఏళ్లు వయస్సు దాటినవారు
18 ఏళ్లప్పుడు చేరితే
18 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే మీ పెన్షన్ పరిధిని బట్టి నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 40 ఏళ్ల వయస్సులో చేరితే 60 ఏళ్లు వచ్చేవరకు నెలనెలా రూ.291 నుంచి రూ.1454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా ప్రీమియం డబ్బులు కట్ అవుతాయి. ఇందుకోసం ప్రీమియం కట్టయ్యే సమయానికి అకౌంట్‌లో డబ్బులు ఉంచుకోవాలి. లేకపోతే ఆలస్యపు ఫీజు, జరిమానా కట్టాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ కోసం డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి పథకం. 60 ఏళ్ల తర్వాత నెలనెలా పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ మీరు మరణిస్తే నామినీకి పెన్షన్ అందుతుంది. దీంతో కుటుంబానికి భద్రత కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకం కావడంతో మీ డబ్బులకు రక్షణ ఉంటుంది. తక్కువ వయస్సులోనే ఈ పథకంలో చేరితే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అదే వయస్సు పెరిగే కొద్ది ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు.
